పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15


అంత్యనియమము కలదు. వేమన గీతములందువలె రుబాయిలలో తత్త్వములు, నీతులు సంక్షేపించి చెప్పుటకు అనువుగా నుండును. ఖయ్యాము రుబాయతు హఫీజు సాబైనామా యీ తెగ కావ్యములలో గణ్యములైనవి.

ప్రబంధకవుల పోకడలు

ప్రపంచమందంతటను మానవస్వభావ మొకేతీరుగ నున్నది. అరిషడ్వర్గములనంబడు కామ క్రోధ లోభ మోహ మద మాత్స ర్యములు జగదేకములై సృష్టి స్థితి లయములకు బాహ్య పాతువులై బ్రాణికోట్లను ఐహికమార్గమున నడువుచున్నవి. ఇట్టి ప్రకృతిని ఆశ్ర యించిన కవిత్వముకూడ అన్ని దేశములందు ఒకే విధముగ నుండును. అయినను దేశకాల భేదములు ప్రత్యేక జాతీయశీలము, భిన్నా చార వ్యవహారములు ఆయాదేశీయ కవిత్వములకు అనితరసాధ్యమును అనను కరణీయమునగు విశిష్టతను చేకూర్చును. పారసీ సాహిత్యముకూడ ఈ న్యాయమునకు బాహ్యముకాదు.


పారసీ కావ్యములందు సున్నితమైన శృంగారము కలదు. ఆ కవుల దృష్టి ప్రియురాలి ముంగురులను, చెంప జుల్పాలను, నర్గిస్ పూలవంటి కన్నులను, గులాబిరంగు చెక్కిళ్ళను, తేనెయూరు వాతెఱును, కపోల తిలకమును, నవ్వునపుడు చెక్కిళ్ళపై నేర్పడు పల్లమునుదాఁటి క్రిందికి ప్రసరింపలేదు; దగ్గరున్న పాలిండ్లపై దుము కలేదు; అటనుండి నున్నవి నూగారు వై జారి పొక్కిలిలో పడలేదు; సాధారణముగా పారసీక విలాసవతులు కుడితినీ తోడుగుకోని గాగరా కట్టుకొనియుండుటయే దీనికి కారణమైయుండును.

ప్రబంధ యుగమునాంటి ఇతరదేశముల కవులందటీవలే పార సీక కవులును కవిసమయ సంప్రదాయ బద్ధులు. మన ప్రబంధకవుల నాయిక నడుము మొట్టమొదట పంచానన మధ్యమయి, కృశించి, పసచెడి, సన్నగిల్లి అస్తి నానీ విచికిత్సకు లోనయి తుట్టతుదకు గగనము