పుట:Palle-Padaalu-1928.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీర గాథలను రచింపజేసే ఉత్సాహమూ 'మెప్పుదల, - ఒక్కోక్కప్పుడు - దుంఖమూ ప్రస్తావిక పదములకుకూడా కారణమౌతవి. వీరుల జీవితములూ, వీరక్రుత్యములూ అనుకోకుండా వచ్చేటివే కదా ? అట్లాగనే ఆర్బతువాటికంపె వీరముచ్చట, గోదావరి పుష్కరాలు, బియ్యపు కంట్రోలు అన్నవి ఒకొక్క సమయానికి అవతరిస్తావి.

మొన్న వచ్చిన గోదావరి వరదలపై ఎన్ని పాటలో వచ్చాయి. 'ఎల్లమ్మ చెరువునీరూ ఏనాడో పొంగి రైలుతో సహా రైలువంతెనను కొట్టి వేసిన పాట ఒకటి ఉన్నది. రాజకీయ గేయములు కూడా ఒక ఉద్యమాన్ని పట్టి బయలు దేరినవే. పొట్టి శ్రీరాములు గారి మీద 'జోహార్ జోహార్ ' అన్న పాట చక్కనిది జయలుదేరినది, “అల్లూరి సీతారాం రాజా" అన్నది వీర గేయమే.

81