పుట:Palle-Padaalu-1928.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరభద్రా రెడ్డి

—— వీరభద్రారెడ్డి కధేవేరు. ఇది మా ప్రతాపరెడ్డి గారి సేకరణ. ఈ గేయములోని వీరభద్రారెడ్డి శ్రీనాధ కవి సార్వభౌముని ప్రభుడే అయి యుంటే తెలుగులో ఇదే అతి ప్రాచీనమైన జానపద గేయము,

రెడ్డోచ్చె రెడ్డోచ్చె రెడ్డోచ్చె నమ్మా వీరభద్రా రెడ్డి విచ్చేసెనమ్మ
పొద్దున్నెమా రెడ్డి పొరకూడిపించు
       నిలువెల్ల నడివీధి నీరుజల్లించు ౹౹రెడ్డోచ్చె౹౹
సందుగొందులలోను పాన్పుపోయించు
       చీకట్ల పసుపుకుంకుమలు పూయించు ౹౹రెడ్డోచ్చె౹౹
రంగవల్లులనూరు రాణింపజేయు
       తోరణాల పంక్తులా తులకింప జేయు ౹౹రెడ్డోచ్చె౹౹
దివ్వెలను వెలిగించు దివ్య మార్గాల
       మాపెల్లిపాలించు మంచి మార్గాల ౹౹రెడ్డోచ్చె౹౹
ఎండలకు పందిళ్ళు వేయించువాడూ
       పొందుగా మా రేళ్ళు కోయించువాడూ ౹౹రెడ్డోచ్చె౹౹
ఊరిబావులలోన ఉప్పునున్నాలా
       వెదజల్లు నేటేట నిండుపున్నానా ౹౹రెడ్డోచ్చె౹౹

చల్లని ఇంపైన గేయముకూడాను ! ఈ సంపుటములోనే భక్తి గేయాలలో ఇచ్చిన “శివశివయన మేలు తుమ్మెదా, శివయంటేను వినమేలు తుమ్మెదా” అన్నది దీని కంటే ప్రాచీనము (అనగా పాల్కురికి సోమనాధుని కాలమునాటిది) కావచ్చు గాని 'అవును 'అని నిశ్చయముగా చెప్పలేము, దీనిలో వీరభద్రారెడ్డి పేరుగలదు; పలు నాటిషన పటానికి ఆక్షేపణ లేదు. {{right|80||