పుట:Palle-Padaalu-1928.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డేరాల కోపు


చవాల్, చవాల్, మీద |చందమామ |
చదలేటి మానోకటి | చందమామ|
చదలేటి మాను మీద చందమామ|
సరసమాడే భోగమోళ్ళు |చందమామ | ౹౹చవా౹౹
చల్, పోద్దు కెక్కించారు !చందమామ |
చల్, పొన్నపువ్వు డేరాలు చందమామ |
చల్, మంచు కెక్కించారు. చందమామ |
చల్, మైనపు డేరాలు చందమామ |
చల్, నీడ కెక్కించారు చందమామ |
చల్, నీలిపువ్వుడేరాలు !చందమామ|
చల్, ఎండల కెత్తించారు చందమామ |
చల్, వెండిపువ్వు డేరాలు చందమామ||

59