పుట:Palle-Padaalu-1928.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెంచు లక్ష్మి కోపు

స్త్రీ:- ఎక్కాడివాడవు . యిక్కాడికొచ్చేవు:
ఎక్కువుగ, మాటలేలరా. మగవాడి
        చక్కంగ మళ్లి పోరా ౹౹ఎ౹౹
వగచి, నావంక జూచి ఎగసిగంతేసేవు
ముంగటముల్లు నాటెర మగవాడ
       వెనకాల యంబు నాటెరా ౹౹ఎ౹౹
పు:- కూకోవోలె చెంచీత కుదిరి మద్దిల్లి సందు
కుదురూగ, ముల్లుదీయవె? ఓలెచెంచు
       వెనకాలయంబుదీయవె ౹౹కూ౹౹
స్త్రీ:-మాటామాటకునన్ను . ఓలె చెంచానేవు
పట్టి బాణాన వేయింతు , మగవాడో !
       పంచబాణానవేయింతు ౹౹మా౹౹
పు:-కట్టింతు నేయిల్లు , కారండపడవిలో
ఎత్తింతు పసిడి కుండలు; ఓలచెంచూ !
       వెయ్యింతు చిలుకు జవ్వాయి ౹౹క౹౹
స్త్రీ:-ఆరె? ఆరే? నీవు! ఆగడము కొచ్చేవు
అదురూ, బెదురూ; లేదటరా! మగవాడ !
ఆగడములు మానరా ! ౹౹ఆ౹౹

57