పుట:Palle-Padaalu-1928.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోబ్బిపాట

పిల్లలు ఆటలాడుతూ పాడే పాటలు చాలా వున్నవి. వాటిని పల్లెపదాలనటం కంటే బాల గేయాలనటం మెరుగు. వారి ఆటల పాటలలో లయ, యతిప్రాసలూ తప్ప మానవుల ఊహలున్నూ ఉద్దేశాలున్నూ ఉండవు. ( ఇంగ్లీషులో బాలగేయాలను ప్రాస క్రీడలనే అన్నారు గాని పాటలనలేదు.) ఈ బాల్యావస్థ దాటిన ఆటల పాటలు గొబ్బి పాటలేననిపిస్తుంది.

గొబ్బి కాటమరాజు కథలో మొదట కానవస్తుంది. క్రీ. శ. 1424 నుండి 1503 వరకూ జీవించిన అన్నమయ్య గారి సంకీర్తనములలోని “కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకులము సామికిని గొబ్బిల్లో " అన్న కీర్తననుబట్టి ' గొబ్బిళ్ళో ' అంటే నుతులు, పూజలు, అన్న అర్థము వస్తుంది. ఈ శతాబ్దారంభములో 'స్త్రీల పాటల ' నచ్చువేసి ఈ వాజ్జయాన్ని ఉద్ధరించిన నందిరాజు చలపతిరావు గారు దశమస్కంధ పూర్వభాగము, ప్రశ్నోత్తర గొబ్బి పాట, చూడికుడుత్తాళ్' మీది గొబ్బి పాట, అని మూడు పాటల నచ్చువేసినారు. ఈ పాటలలో గొబ్బియళ్లో, గోబ్బి, అన్న మాటలు నుతులు అన్న అర్థముతోనే కనబడుతున్నది. "గొబ్బిపాట " అన్నమాట " గోబ్బిళ్ళ పాటల వరసలోని పాట” అన్న అర్ధముతో ఉన్నది. కనుక గొబ్బి పాటలు ఒక వరసగల పాటలున్నూ 'గోబ్బీయళ్ళో " అన్న మాటలు తుమ్మెదా, వెన్నెలా వంటి పాజాంత పదములూ నన్నమాట. గోబ్బి పాటల వస్తువు సామాన్యముగా పౌరాణికము గానే వుంటుంది. మచ్చుకు ఒక్కటి.

గంగమ్మ గొరమ్మ ఆప్ప సెల్లెండ్రూ గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
ఒక తల్లి బిడ్డలుకు వైరమూ లేదు " "
మంచి మంచి పూలేరి ఒకరాసిపోసిరి " "
కానరాని కలువలేరి ఒకరాసిపోసిరి " "
ఏడు మూర లింటిలో ఏడోక్క తూము " "

54