పుట:Palle-Padaalu-1928.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రోకటి పాటలు

——రోకటి పాటలు ——విన్నకోట పెద్దన్న చెప్పినట్లు —— తిరువోల నుండి అవతరించాయి. నన్నయ పూర్వపు శాసనాల్లో ఈ పాటల వరుసలు చాళుక్య న్రుపులు చేయించిన సంస్కారముతో కనబడతాయి. పన్నెండో శతాబ్దపు నన్నె చోడుడు, శబరకామిని గోరుకొమ్ము రోకట వెదురు బ్రాలు పటిక పుణోల బోనడించుచు జంగమలింగమును పాడిన రీతిని చక్కగా వర్ణించినాడు. పోల్కురిక సామన్నగారి ప్రభావము నట్లు తెలుగునాట బలిసిన ద్విపదల బలము రోకటి వాటల్నీ కూడా ఆ మూసలోనే రంగరించినది. అప్పటికి ద్విపదలలో కనపడని అయిదక్షరాల ఆవ్రుతానీ పాటలలో విరివిగా కనపడుతూ వీటి మాతృక అయిన తరువోడ పోలికను చూపిస్తవి.

విసురు రాతి పాటలూ, రోకలి వాటలూ, (విశాఖ మండలము) కోలలూ బక వరుసలో నన్నప్పటికీ వీటి వస్తువులో భేదములు లేకపోలేదు. విసురు రాతిపాటలు సోదరుని అభిమానమూ, పొడుపుకథవంటి సమస్యా, పుట్టింటి అందమూ, ప్రేయసి పరివేదనమూ, పంటి అనుభవ భీజముల చుట్టున్నూ అల్లిన అందపు గూళ్ళు, వినరేవారు ఇద్దరే. వినేవారెందరో ఉండరు. కనుక విసురురాతి పాటలు అనుభవాన్ని తనకే చెప్పుకుంటూ నెమరు వేస్తున్నట్టుంటాయి. రోకటితో దంపుతున్న ఆయాసములో కల్పన సాగటానికి అవకాశము తక్కువ. తల్లియైన తరువోజను ఒట్టి నాలుగు పాదాలకూ, ద్విపద ప్రభావాన్నిబట్టి రెండు పాదాలకూ దిగుతుంది రచన. వినటానికి అయిదారుగురుంటారు. కనుక రోకటి పాటలు స్వగతాలమాదిరి కాక ఒకరిని సంబోధించినట్టే వుంటాయి. వాటి పోడవు చిన్నది గనుక ఆసుభవసారమంతా వాటిలో మాత్రగట్టినట్టు ఉంటుంది. వీటి నన్నిటినీ సేకరించినేని నట్లయితే భారత మంత గ్రంధమౌతుంది. మచ్చుకు ఏవో కొన్ని.

1

నాచేతి రోకళ్ళు నల్లరోకళ్లు
చేయించు అన్నయ్య చేవరోకళ్లు

48