పుట:Palle-Padaalu-1928.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవ్వముపాట


——ఈ కవ్వము పాట కిటతక కిటతక అని నాలుగక్షరాల అవ్రుతాలతో నడుస్తూ కోలాటాని కనుకూలంగా ఉన్నది. కోలాటపు పాటే అన్నా నమ్మవచ్చును.

అన్నా బిందేటి పాలు - కిన్నెరల మోత
       అమ్మా చేసేదీ చల్లోయీ
అమ్మా చేసేదీ చల్లా - కవ్వాల మోత
       రాగిదీ కవ్వామోయీ
రాగిదీ కవ్వాము - రవ్వాడే వెన్న
       చింతాదీ కవ్వా మోయీ
చింతాదీ కవ్వాము - చిల్లాడె వేన్న
       దంతేదీ కవ్వా మోయీ
దంతేదీ కవ్వామూ - ధ్వనులెల్లచల్ల
       ఉక్కూదీ కవ్వా మోయీ
ఉక్కుదీ కవ్వాము ఊగోచువెన్న
       రేపల్లెవాడలోయీ
రేపల్లి వాడల చల్లమ్మ చల్ల