పుట:Palle-Padaalu-1928.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈశ్వరా జగదీశ్వరా

ఈశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా కరుణింపరా
శాశ్వతుడవని వేడితిని విశ్వాసముంచర యీశ్వరా
ముందు జేసిన పూర్వకృతములు ఇందుబాపుము యీశ్వరా
పొందుగా మీపాదపద్మము జెందియుంటిని యీశ్వరా
కపట విద్యలు నేర్చి పొట్టగడుపుచుంటిని యీశ్వరా
నెపము లెన్నక నన్ను నీకృప నేలుమీపరమేశ్వరా
ఆరుగురు శత్రువులునాపై క్రూర మెంచిరి యీశ్వరా
పరమ మంత్రముచేత శత్రుల నణచవలె పరమేశ్వరా
తొమ్మిది ద్వారములకొంపిది నమ్మ నేటికి యీశ్వరా
బొమ్మలాటపాలుచేసి బ్రోవకుంటివి యీశ్వరా
మూడుగుణములు విడువజాలక మోసపోతిని యీశ్వరా
వేడ్కితోనీ మాయదాటనుపాయమేదో యీశ్వరా
చంకదుడ్డె మకింకరులకు జంక నేరను యీశ్వరా
ఆంకమందున జేర్చి సద్గురు శంకదీర్చర యీశ్వరా

ఇది యెడ్ల రామదాసుది. తరుచు వినబడుతుంది.