పుట:Palle-Padaalu-1928.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒంటి బ్రతుకు

ఆంచి యామనికొండ పక్కనా పెనుగొండ
పై దళము రాకుండ పారింది జండా
ఒంటి నేనుండలేనో చందమామా
ఒక్కదానీ కోనలో
ఏనూరు ఏతాలు ఇన్నూరు కాలువలు
ఎంత చక్కని దయ్య ఈపూలవనమూ ౹౹ఒంటి౹౹
మంచి నీళా బావి మన పెరటనుంచుకొని
ఉప్పు నీళ్లకు బోవ ఉపకారమేమో ౹౹ఒంటి౹౹
మల్లెపూలాతోట మన పెరట పెట్టుకొని
చీకిపూలకు బోవ సింగారమేమో ౹౹ఒంటి౹౹
దవణ మేసిన రాజు కల్లనాటకపోయె
కావిలుండకపోయె
ఎనలేని దవనంబు ఏటిపాలాయె
ఒంటి నే నుండలేనో చందమామా
ఒక్కదానీ కోనలో

ఒంటి బ్రదుకు వద్దట ఈ పిల్లకు. ఇక నేమి? ఊరిముందరి చేను ! కాకులకు పండుగ.