పుట:Palle-Padaalu-1928.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాలపల్లి తూముకాడ | మల్లెపువ్వులతోటకాడ
బాలుడేమన్నా డేపిల్లా?
మాలపల్లితూము కాడ | మల్లెపువ్వుల పందిరి క్రింద
మల్లి, మల్లి, రమ్మన్నాడమ్మా !
క్రిందవి కడియాలు | మీదవి పావడాలు
నెత్తి మీదనాగరము | ఏ దేవుడిచ్చేడే పిల్లా ! ౹౹అబ్బ౹౹
కడియాలు, కామరాజు | పావడాలు పాపయ్య
నాగరము నాగరాజు | నన్ను కోరి, కోరి; యిచ్చేరమ్మా !
ముంతంత కొప్పుమీద ! మూడు చేమంతిపూలు
ఏరాజు పెట్టేడమ్మా : అబ్బ | ఎంత చక్కగున్నావే పిల్లా !
చేమంతి పువ్వులు | చెంగూలోన బెట్టి
కోరి, కోరి; పిలిచేడే ! నాయుడు
అబ్బగుండె ఝల్లు మన్నాదమ్మా!
కాళ్లకు కడియాలు | వ్రేళ్లకు మట్టెలూ
నాయు డెప్పుడిచ్చేడే పిల్లా ?
కాసులు పేరు వేసుకొని | కాలువగట్టున వెళుతుంటే
కాని పట్టుపట్టాడే నాయుడు | ౹౹అబ్బ౹౹
ఎలమంచలి రోడ్డుమీద | తాలూకాకచేరి కాడ
తాళపాలెం రేపులోన: పిట్లా కోనేరు కాడ
ఎగిరి, యెగిరి లేచేడమ్మా ౹౹అ౹౹