పుట:Palle-Padaalu-1928.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంగమ్మొదినా

——ఇది ఎవతెయో కప్పతలకాయ దీనిది. వళ్లె మనిషిది. వధువు నాని ఎగిరిపోయిన తుమ్మెద కోసము ఎదురు చూస్తున్నది. వాడెవడో బర్సాత్ నాయకుడు. నిరతంబు మల్లిక కడనె యుండి ముదము గూర్పగ నాతని కొక్క పూవేనా?

సెంగావి సీరగట్టి రంగూలారవికె తోడిగి
కోంగూనూ జారయిడిశానే ఓగంగమ్మొదినా
నేముందరెల్లి వయ్యారినిలచితినే ఓగంగ మ్మొదినా
బంగమయ్యె నావాలుచూపులే ఓగంగ మ్మొదినా
సెవలా తమ్మంట్ల యెరుపూ సేతిమురుగూల పసుపూ
సేదేనే మీసాలనలుపూ ఓగంగ మ్మొదినా
నాబారమంతా నీకెదక్కేనే ఓగంగ మ్మొదినా
కోరపొగాకోరసూసిందే ఓగంగమ్మొదినా
ఉంగ్రాల జుట్టుదువ్వి సెంగల్వపాగాదిద్దీ
అంగాలొ ఆగిపోయాడేఓగంగ మ్మొదినా
నాసంగతేదో సూసిపోయేడే ఓగంగ మ్మొదినా
పొంగుపొంగు అణిగిపోయిందే ఓగంగ మ్మొదినా
పొద్దుకూకే పూలసాయా ఆద్ద రేతిరిది ఆ అరుపు
నిద్ద రేదే నీలికళ్లకు ఓగంగ మ్మొదినా
సద్దు లేని జాములొకటైనే ఓగంగమ్మొదినా
వారాలు తిరిగిపోయె దూరాలు దూరమాయె
ఏరోజా రోజు గడవాదె ఓగంగ మ్మొడినా
మారాజు రాక లేనాడో ఓగంగ మ్మొదినా
నా రాతలేమిరాశాడో ఓగంగమ్మొదినా