పుట:Palle-Padaalu-1928.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెరబండి

——బండి. మానవ కోటికి పూర్వజన్మము సెలయేటి బిందువులు కాబోలు. ఆందుచే ప్రయాణమన్న అందరికీ అంతయిష్టము. బండి, నాటినుండి నేతివరకూ నిలిచిన వాహనము. ఎన్ని జంటలనో వలెనే బండి ఈ జంటను కూడ మోసుకోని సాగుచున్నది.

నారా నెరా నెరబండి
నీలమోరి బండి ...నెరా
అద్ధ రేతిరికాడ నిద్ధారోతుంటేను
బండెక్కు బండెక్కుమన్నా డెబావ ...నెరా
జల్హారి సీరకట్టి జడకుచ్చు లెనకట్టి
నిలుసుంటె నాకేసి ఎగాదిగా సూసేడు ...నెరా
పుల్లెద్దు బండికట్టి తెల్లెద్దు బండికట్టి
పుల్లెద్దు తెల్లెద్దు ఏకమైనాయి ...నెరా
ఎద్దులకి మువ్వలుకట్టి నాతల్లా పువ్వులుపెట్టి
మువ్వలుసప్పుడు పువ్వుల వాసన ఒకటైపోయినాయి ...నెరా
మూటకట్టమన్నాడు ముల్లెకట్టమన్నాడు
మూటముల్లెకట్టి ఎన కెక్కమన్నాడు ...నెరా
పాటలు పాడుకుంటా మాటాలాడుకుంటా
కమిసి కర్రోట్టుకొని ఎనకాలేక్కాడు ...నెరా
గట్టంటె గట్టుకాదు పుట్టంటె పుట్టకాదు
గతుకుల్లో మాబోవ సతికిల్లబడ్డాడె ...నెరా
పక్కపల్లంలోను చెక్కబెల్లం వుంటేను