పుట:Palle-Padaalu-1928.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాయిరాయి కాగితం

వినోదములేనిదే జీవితము లేదు. ఆహార నిద్రాదులు శరీరమున కానందమునిచ్చిన, వినోదము మనస్సున కుల్లాసమునిచ్చును. చీకటింటికి వెలుగున్నూ చింతలుకమ్మిన మనస్సుకి వినోదమున్నూ అందము.

తెలుగునాట వినోదాలకు లెక్కలేదు. నాతాని జియ్యరూ, భద్రాద్రి యాత్రికులూ, గారడీవారూ, గంగెద్దు దాసులూ, కొమ్మ దాసులు కోయమామలు, పెళ్లాడే బొమ్మలు బుడబుక్కలవారూ, సోదివాండ్రూ, దసరాపిల్లలూ, ఎవరో ఒకరు ఏడాది పొడుగునా పాటలు పాడుతూ రంజిస్తునే వుంటారు.

——అడుగో ఎర్రనిపాగా, నల్లని శర్ర్రము, పచ్చని చెవిరింగులూ రాగి దండకడియాలూ, ఎండు వేళ్ల మురుగులూ, పచ్చిపసుపు, చంద్రవంక బొట్లు, వీపున విల్లంబులతో కోయమామ!

నీలాటి కోయమామ మాలాటి దేశ మొస్తే
ఉట్టిమీద పెట్టి ఊరేగించెదము రాయిరాయి కాగితం
వాడీడిపుణ్యాన్న అబ్బాయి పుడితేను
కోయరాజు పేరుపెట్టు కోండి రాయిరాయి కాగితం
ఏడీలు సీడీలు ఎక్కు వైకొందరు
ఎనక సెక్కరాలు వెంటబడ్డాయి రాయిరాయి కాగితం
దమ్మిడీ కూలోళ్లు దగుల్బాజీ గుత్తోళ్ళు
గొప్పకు రమ్మంటేను రాయిరాయి కాగితం
కొప్పులు దిప్పేరు ఇంటిలో తలదువ్వి
ఈధిలోకొస్తేను బేడకి దానికొప్పు బేరమైంది రాయిరాయి కాగితం

రాయిరాయికాగీతం అంటే ఉత్తరము రాయమని కాబోలు.

118