పుట:Palle-Padaalu-1928.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాముద్రికం

——కోయమామ చెయ్యి చూచి సాముద్రికంకూడా చెప్పగలడు.

సేయిసూస్తారా పిల్ల
సేతిలోబంగారు రేకున్నది;
కుళ్ళాయి, కుచ్చుంది
కూకుని తింటావుపిల్ల;
బాలెంత రూపుంది
బాధపడతావు పిల్ల:
బండిమీద కల్లుంది
బహుజోరుగా వుంది;
తాగుతాగు పిల్ల
తన్ను ల్తింటావు పిల్ల ౹౹సేయి౹౹

ఇవి పూర్తిగా పరమార్థమున్నూ కాదు, పరిహసమున్నూ కాదు. అక్కడే వుంది వీని ఆందము

119