పుట:Palle-Padaalu-1928.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అత్తగారుపోరు గుమ్మడే
       ఆడబిడ్డలుపోరు గుమ్మడే
పడలేక నేను గుమ్మడే
       మావూరు పోతున్నా గుమ్మడే
'పెద్ద నోరు లేర తుమ్మెదా
       కంతబుద్ధి చెప్పడానికీ తుమ్మెదా
బుద్ధ సెప్పేటోళ్ళకి గుమ్మడే
       అసలుబుర్రేలేదు గుమ్మడే
అత్త లేనియిల్లు తుమ్మెదా
       ఆరళ్లు ఉండదు తుమ్మెదా
       ఆయిగా ఉంటాను తుమ్మెదా

బుద్దిచేప్పేవారు అక్కడా వున్నారు. అసలు సంగతి వారి కెట్లెరుక పడును ? తెలిపోయినా చెప్పుటకందరూ పెద్దలే. వారికే " బుద్ది లేదట” ఇలాటి పడుచులే

" ఆడదానినయి పుట్టుటకంటె
అడవిలో మానయి పుట్టుట మేలు "

అని నిట్టూర్పులు నిగిడ్చేది !