పుట:Palle-Padaalu-1928.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుట్టినింటికి

——అభిజాత్యము ముదిరిన సిరిమంతులకు విడ్డూరమైనది విడాకులు. పాటకపు జనములో ఇవి పరిపాటియే. మగని బాధపడలేక పుట్టినింటికీ నడక సాగించినది అభిమానపు పడుచు ! "కాశి కెళదా మంటె కదలవేకాళ్లు, ఢిల్లి కెళదా మంటె తిరగదె మనసు. నా వారి పుట్టింటి కెళదాము అంటే, "నా కాళ్లు పన్నిన్న రధములై నడచు నాచేతులుయ్యాల చేరులై యూగు." అయితే దారితోడు నుంచి ప్రశ్న వచ్చింది.

ఏవూరు ఏపల్లి తుమ్మెదా
       ఎక్కడికి ఎల్తావు తుమ్మెదా
గులకల్లపాడూ గుమ్మడే
       గోదారి పక్కని గుమ్మడే
గులకల్లపాడూ తుమ్మెదా
       అత్తోరు ఊరూ తుమ్మెదా
       పుట్టిల్లు లేక తుమ్మెదా
పుట్టిల్లు మాదా గుమ్మడే
       గులకల్లపాడే గుమ్మడే
పొడిపంటఉందా తుమ్మెదా
       సంతానము ఎందరె తుమ్మెదా
పాడిపంట లేదు గుమ్మడే
       సంతానము లేదు గుమ్మడే
అత్తగారు ఉందా తుమ్మెదా
       ఆడబిడ్డలు ఉన్నారా తుమ్మెదా

107