Jump to content

పుట:PadabhamdhaParijathamu.djvu/867

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జిత - జిఱ్ఱ 841 జిఱ్ఱ - జిల

జితపాటు

  • అలవాటు.

జిత్తులమారి

  • ఉపాయశాలి, మాయోపా యజ్ఞుడు.

జిత్తులవాడు

  • చూ. జిత్తులమారి.

జిద్దుగొను

  • ఎదుర్కొను. రంగా. 2. 40.

జిమ్మ దిరుగు

  • దిమ్మ తిరుగు.
  • "....జిమ్మ దిరిగి దశ శిరుండు." భాస్క. అర. 2. 135.

జిమ్మ పడ!

  • ఒక తిట్టు. వాడుకలో జిమ్మడ! అనీ వినవస్తుంది.

జిరాయితీ హక్కు

  • సేద్యం చేసుకునే హక్కు.<.big>

జిఱకొట్టు

  • గిరికీలు కొట్టు.
  • ధ్వన్యనుకరణము.
  • "చెరలాడు జిఱకొట్టుఁ జెలఁగి పేరెంబు, దిరుగుఁ బర్విడు."
  • గౌ. హరి. ప్రథ. పంక్తి. 605-06.
  • గౌ. హరి. పూ. 699. పం.

జిఱ్ఱ జిఱ్ఱ

  • ధ్వన్యనుకరణము.

జిఱ్ఱత్రాడు

  • పురి పెట్టిన తాడు.

జిఱ్ఱ దిరుగు

  • గిరగిర తిరుగు.
  • "చక్ర భ్రమణంబునఁ జిఱ్ఱ దిరిగి." నైష. 3. 151.

జిఱ్ఱన తిరుగు

  • గిర్రున తిరుగు.
  • ధ్వన్యనుకరణము.
  • "రజత ధరణీధర మ,చ్చెరువుగఁ జిఱ్ఱనఁ దిరిగెన్, బురహరుతోఁ గూడ వెండి బొమ్మరముక్రియన్." కుమా. 6. 155.
  • "నెగడు మందరగిరి నిలు వెంత కడు భోగి, దీర్చిన జిఱ్ఱనఁ దిరిగె నట్టె." కుమా. 3. 5.

జిఱ్ఱవోవు

  • జిఱ్ఱు మని చెవులు దిమ్ముపడు. శృం. శాకుం. 3. 115.

జిఱ్ఱున చీదు

  • ధ్వన్యనుకరణము.
  • "కడుఁ గపాలము దాఁకి కలగంగఁ జక్కఁగాఁ, జే సాఁచి జిఱ్ఱునఁ జీఁది చీఁది." కా. మా. 2. 148.

జిఱ్ఱున దిగుచు<.big>

  • చరాలున లాగు.
  • ధ్వన్యనుకరణము.
  • "తూణికాబాణము జిఱ్ఱునం దిగిచి." కా. మా. 3. 115.

జిలకఱరాజనాలు

  • సన్నని ధాన్యవిశేషం.