పుట:PadabhamdhaParijathamu.djvu/866

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జావ - జిగు 840 జిగు - జిత

 • "కాస్త గట్టిగా అదిలించా మంటే వీడు జావ కారి పోతాడు." వా.
 • చూ. జా వయి పోవు.

జావయి పోవు

 • భయపడి పోవు, నిర్వీర్యు డగు.
 • "ఆవిడముందు నిలబడినా డంటే వీడు జావయి పోతాడు." వా.

జిగటరకం

 • పట్టుకుంటే వదలనివాడు అనుట.
 • "వాడిది ఒట్టి జిగటరకం. తగులుకుంటే ఇంక అంతే. కాళ్లు చీములు పట్టవలసిందే." వా.

జిగిదేఱు

 • కాంతి తేలు.

జిగురుకండె

 • చూ. జిగురు చుట్టిన కండె.
 • రూ. జిగురుగడ.

జిగురు చుట్టినకండె

 • వేటలో పక్షులను పట్టుకొనుటకు ఉపయోగించునది, వదలనిది. తాళ్ల. సం. 12. 75.
 • చూ. జిగురున పడ్డ...

జిగురున పడ్డ రాచిలుక

 • చిక్కున పడినది.
 • పక్షులను పట్టుకొనుటకై ఒక శివవంటి దానిపై ఒక చిన్న పలక నమర్చి దాని మీద వజ్రంవంటి జిగురును అతికిస్తారు. దాన్ని ఏ చెట్టు మీదనో పెట్టినప్పుడు చిలుక వాలడం, దాని కాళ్లు కరుచుకొని పోయి వేట కానికి చిక్కడం జరుగుతుంది. లక్షణయా వదిలించుకొని పోవ వీలులేని పరిస్థితిలో పడిన అనుట.
 • "జిగురునఁ బడ్డరాచిలుకచెల్వున." కా. మా. 4. 29.

జిగురు వైచు

 • వల వైచు వంటిది.
 • పూర్వం వేటకాండ్రు కొన్ని పక్షులను పట్టుకొనుటకై పలకలపై జిగురు పూసి చెట్లపై పెట్టేవారు. పక్షులు వాలి చిక్కుకొని వాళ్లకు చిక్కేవి. అందుపై వచ్చిన పలుకుబడి. నేడు కూడా ఈగలకై జిగురుకాగితాలు పెట్టుట అలవాటు.

జిడ్డుకొను

 • జిడ్డు తేలు. పాండు. 4. 253.

జిడ్డుపడు

 • వ్యర్థ మగు.

జిడ్డుపఱుచు

 • వ్యర్థ పఱుచు, కలత పెట్టు.
 • "నీ పడ్డపాటు వృథగా జిడ్డు ఱేపం గలవారమె." హర. 2. 132.

జితపడు

 • అనుకూలపడు.