ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చుట్టు - చుట్టు 746 చుట్టు - చుట్టె
- 3. క్రమ్ము, వ్యాపించు; పాల బడు.
- "విధాతృ మఘమూర్తులం జుట్టుకొన్న యజ్ఞానతిమిరంబు." కాశీ. 5. 100.
- "ఇల్లంతా పొగ చుట్టుకొన్నది." వా.
- "వీళ్ల నాన్న నాగుబామును చంపాడట. పాపం వీణ్ణి చుట్టుకొంది. అంచేతే వీడికి సంతానం కలుగ లేదు." వా.
చుట్టు కొల్లారము
- చుట్టు బవంతి.
చుట్టుగత్తి
- చక్రము.
- "చుట్టుం, గత్తిన్ మధుకైటభోరు కంఠము లలనాఁ డొత్తిన." పాండు. 2. 33.
- చూ. చుట్టుకైదువు.
చుట్టుగుల్ల
- శంఖం. బ్రౌన్.
చుట్టు గొల్లారము
- నడుమ ఖాళీ. చుట్టూ కట్టడం గల యిల్లు.
చుట్టు చవికె
- చుట్టిల్లు.
చుట్టుదారి
- దూరం దారి.
- "అలా వెడితే ఎలా. చుట్టుదారి అది." వా.
- చూ. చుట్టగు.
చుట్టుపట్టు
- సమీపప్రాంతం.
- "చుట్టు పట్టున నెట్టి బెట్టిదంబు సింగంబులుం జన వెఱచు." కాశీ. 3. 82.
- వాడుకలో రూపం - చుట్టుపట్ల.
చుట్టుపట్ల
- సమీపప్రాంతంలో.
- "ఈ చుట్టుపట్ల అంత ధనవంతు లెవరూ లేరు." వా.
చుట్టుబవంతి.
- చూ. చుట్టిల్లు.
చుట్టుమాలె
- చుట్టు బవంతి.
చుట్టుముట్టు
- చుట్టుకొను, చుట్టుకొని పట్టుకొను.
- "సుడివడ్డ చామలఁ జుట్టుముట్టి." జైమి. 1. 4
చుట్టు ముట్టుకొను
- ముట్టడించు.
- "ఉ,వ్వెత్తుగఁ జుట్టు ముట్టుకొని యీటెల డొంకెనలం గటార్ల బ,ల్కత్తు- నత్తలంబులను." కళా. 8. 58.
చుట్టు వడు
- పెనగొను.
చుట్టువారుకొను
- క్రమ్ముకొను. సారం. 3. 28.
చుట్టువాఱు
- చుట్టుకొను, ముట్టడించు.
చుట్టెంట
- (చుట్టు + వెంట) తిరిగిన చో టెల్లా.
- పండితా. ద్వితీ. పర్వ. పుట. 480.