Jump to content

పుట:PadabhamdhaParijathamu.djvu/768

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీరా - చీల 742 చీలి - చుంగు

చీరా రవికా పెట్టు

  • చీర, రవిక కానుకగా ఇచ్చు.
  • "పెండ్లికి వచ్చిన ముత్తైదువ లందరికీ చీరా రవికా పెట్టారు." వా.

చీ రావిగొను

  • కంటికి దెబ్బ తగులగా బట్టను మడిచి నోటిలో ఆవిరిపట్టి కంటిని కాపు.
  • "చీ రావిగొని కంటఁ జేర్చి హత్తించి." బస. 3. 84. పు.

చీరికి గైకొను

  • లక్ష్యపెట్టు. శివ. 4. 61.

చీరికి గొను

  • లెక్కించు, లక్ష్యపెట్టు.
  • "నృపాలుండు భటేతరుం డయిన శత్రుల్ చీరికిం గొందురే." ఉత్త. రా. 7. 69.
  • "కాముం జీరికిఁ గోక." హర. 5. 33.
  • చూ. చీరికి గైకొను.

చీరువాఱు

  • పిలుచు; జీరాడు. అర్థ మింకనూ విచార్యము.
  • "సిగ్గుమఱుంగునఁ జీరువాఱ." శ్రీరాధా. 5. 147.

చీలమండ

  • పాదంపైన పిక్కక్రింద ఉండే గుల్ఫము.

చీలమన్ను పూయు

  • పుటం పెట్టేటప్పుడు రెండు మూకుళ్ళు మూసి నడుమ మందు ఉంచి గుడ్డచుట్టి మన్ను పూయు.
  • ఆ యుర్వేద రీత్యా భస్మసిందూరాదులు చేయుటలో దీనిని ఉపయోగిస్తారు.

చీలిగాడు

  • పిల్లి.

చీవాట్లమారి

  • చీవాట్లు తినువాడు. శుంఠ.
  • "ధర్మవిదుఁ డైనరాజు నాస్థానమునను జేరు నొక్కొక్క చీవాట్లమారి శుంఠ." హ్జంస. 5. 113.

చీవాట్లు తిను

  • తిట్లు తిను.

చీవాట్లు పడు

  • తిట్లు తిను.

చీవాట్లు పెట్టు

  • తిట్టు, దండించు.
  • "ఆయనదగ్గరికి వెడితే నాలుగు చీవాట్లు పెట్టి పంపిస్తాడు. వెళ్ళు. వా.

చీళితవెట్టు

  • తొలగించు, రాల్చు.
  • "వాలుగడాలు వాని దళవాయి వసంతుఁడు జైత్రయాత్రకై, సాలములందు జీర్ణదళసంఘము చీళితపెట్టి క్రొత్తగా, మేలిదళంబులన్ నిలిపి." తారా. శ. 2. 112.

చుంగులువాఱు

  • కొంగులు, అంచులు వ్రేలాడు.
  • "కుందనపు టంచు దుప్పటి, సుందరి యొక్కర్తు గట్టి చుంగులువాఱన్." చంద్రా. 6. 15.