ఈ పుట ఆమోదించబడ్డది
క్రొత్త - క్రొత్త 575 క్రొవ్వ - క్షణ
క్రొత్త
- వింత.
- "క్రొత్త దాని వృత్తం బెల్లన్." పాండు. 2. 142.
- వాడుకలో - 'ఆ విషయం నాకు కొత్త.' 'దాని ప్రవర్తన అంతా చాలా కొత్తగా ఉంటుంది.' 'ఏమిటోయ్! ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు.'
- 'ఇన్నిరోజులు లేదు. ఈ రోజేదో నువ్వు కొత్తగా చెప్పొస్తున్నావు.
- ఇలాంటి దగ్గరి భావచ్ఛాయలలో మరికొన్ని తావుల కూడా కనబడుతుంది.
క్రొత్త చేయు
- నూతనత్వము కల్పించు.
- "సత్యభామ మేనఁ గుసుమ శృంగారముల కెల్లఁ గ్రొత్త సేయ." ఉ. హరి. 1. 151.
- 2. పునరుపస్థితము చేయు.
- "సమంత్రక ముష్టిక స్థానక విజ్ఞానంబుగాఁ గ్రొత్త సేసికొనుట మేలు." భార. ద్రోణ. 2. 361.
క్రొత్తముట్టు
- నూలిపోగు.
క్రొత్త వఱచు
- మెఱు గెక్కించు. భార. భీష్మ. 1. 105.
క్రొ వ్వడగించు
- పొగ రడగించు.
- "నీదు క్రొ వ్వడఁగింతున్." కళా. 6. 23.
క్రొవ్వుగొను
- కొవ్వెక్కు.
- "పరువంపుఁ జినుకుల పస గ్రొవ్వుగొని తేల, గిలఁ బడువానకోయిలల యొప్పు." హరి. పూ. 9. 72.
క్రొవ్వు పట్టు
- పొగ రెక్కు.
క్రొవ్వులు వలుకు
- దుర్భాష లాడు.
- "ఈ చపలకుత్సిత విప్రుఁడు వచ్చి నోరఁ గ్రొ,వ్వులు వలుకంగ మీరును చెవుల్ సొర వించు సహించి..." కుమా. 7. 55.
క్రొవ్వెక్కు
- కొవ్వు పట్టు.
- "క్రిక్కిఱి చన్నుదోయి యిరుక్రేవల కాంతియుఁ బంచబాణుఁ గ్రొ,వ్వెక్కఁగఁ జేయ." నైష. 7. 194.
క్రొవ్వెద
- కొప్పు.
- "చెం, గలువలు క్రొవ్వెదకు వేఱొకర్తు ఘటించెన్." ఆము. 6. 129.
క్లేశపడు
- కష్టపడు.
- "అత నా కరువులో పిల్లలతో చాలా క్లేశపడ్డాడు." వా.
క్షణభంగురము
- అనిత్యము.