Jump to content

పుట:PadabhamdhaParijathamu.djvu/587

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోయ - కోర 563 కోర - కోర

కో యని యార్చు

  • 1. కూత వేయు. ధ్వన్యనుకరణము.
  • "కో యని యార్చినం దెసలఁ గుంజరముల్ సెదరెన్." కా. మా. 2. 35.
  • 2. అఱచు.
  • "గురుతర లీల పద్య మది కో యని యార్చుచు నుండె." గుంటూ. ఉత్త. 30.
  • అఱచుటలో ధ్వన్యనుకరణము.
  • "నింగి కయి కుంచె యెత్తి వె,సం గో యని యార్వ." మను. 4. 59.

కోరకొండె

  • వంపుగా ముడివేసిన సిగ. శ. ర.

కోరకొప్పు

  • ముడి వేసి ఒక ప్రక్కగా వెండ్రుకలలో దూర్చి ఓరగా పెట్టిన కొప్పు. కుమా. 8. 143.

కోరకొమ్ము

  • వంపుగా వాడిగా ఉన్న కొమ్ము.
  • "హోమకుండముల పై కుఱికి కొంకర, కోరకొమ్ములఁ గోరాడుఁ గొంత తడవు." వరాహ. 11. 76.

కోరగొను

  • కొంకరలు పోవు.
  • "కాళ్లు నేలపైఁ ద్రొక్కఁగ రాక కోరగొని తొట్రుపడంగ." పద్మ. 3. 79.

కోరచూపు

  • క్రూర మైన చూపు.
  • "కోరచూపుల యెఱ్ఱ చేరు గ్రుడ్డుల వాఁడు." వరాహ. 2. 45.

కోరదౌడ

  • చప్పిదౌడ. భార. మౌ. 25.

కోరపాగ

  • వాలుగా చుట్టిన పాగా.

కోరమీస

  • చూ. కోరమీసములు.

కోరమీసము

  • చూ. కోరమీసములు.

కోరమీసములు

  • పొడుగాటి మీసాలు.
  • "మనుజ రక్త సిక్త తనువును గోరమీ, సములు..." భార. అశ్వ. 3. 87.

కోరలు తీసిన పాము

  • ఏమీ చేయ లేనివాడు - లేనిది - తన శక్తిని చూపగల సాధనమును కోలుపోయిన వారి పట్ల ఉపయోగించే సామ్యం.
  • "వెడగొడ్డుఁ బులి నాకి విడిచిన ట్లైన, జడిసి తొల్లిటి తన జంజాట మెల్ల, నుడిగి కోఱలు లేనియురగంబుఁ బోలె, వడి చెడి...." గౌ. హరి. 2. భా. 973.
  • "ఉద్యోగం ఉన్నన్నినాళ్లూ మహా విజృంభించాడు. అది పోయేసరికి కోరలు తీసిన పాములాగా మూల బడి ఉన్నాడు." వా.