ఈ పుట ఆమోదించబడ్డది
అచ్చు________అచ్చు 32 అచ్చు_________అచ్చు
- "మా పొలం అచ్చుకట్టు వేశాము." వా.
అచ్చు కావలిగాడు
- దొంగలు దోచుకొన్న సొమ్మును దండుగ పెట్టుకొనే కావలివాడు. బ్రౌను.
అచ్చుకుప్ప
- ధనవంతుడు.
- ఆంధ్ర. భా. 3 అ.
- ఇది నేడు వాడుకలో లేదు.
అచ్చు కొట్టినట్టు
- అచ్చంగా అలాగే.
- చూ. అచ్చు దించినట్లు.
అచ్చుకొను
- ఒకరు ఇవ్వవలసినదానికి తాను బాధ్యుడగు.
- "వాడు మా యింట్లో వుండి చుత్తూ అప్పులు చేసి వెళ్ళిపోయాడు. అవన్నీ నేను అచ్చుకోవలసి వచ్చింది." వా.
అచ్చుకొట్టు
- అచ్చువేయు.
- చూ. అచ్చువేయు.
అచ్చుగా
- అచ్చంగా.
- చూ. అచ్చంగా.
అచ్చు గుద్దినట్లు
- సరిగ్గా అలాగే.
- "వీడు వాళ్ల నాన్నను అచ్చుగుద్దినట్లు ఉంటాడు." వా.
అచ్చు టెద్దు
- అచ్చు పోసినఆంబోతు.
- చూ. అచ్చు పోసినఆంబోతు.
అచ్చుదల యగు
- అంగీకార మగు.
- "విశ్వపతీ! విరసోపలంబు లెట్లచ్చుద లయ్యె నీకు." కా. మా. 2. 121.
అచ్చు దించినట్లు
- "వీడు వీళ్ళ మేనమామను అచ్చు దించినట్లుగా ఉంటాడు." వా.
అచ్చు నిలుపు
- దృష్టాంతము నిలుపు.
- "దీని కచ్చు నిలిపితిని నీవ!"
- కుమా. 7. అ. 35 ప.
అచ్చుపడు
- 1. ముద్రిత మగు.
- "ఆ పుస్తకం అచ్చుపడి అప్పుడే యాభైయేళ్లు అయింది."
- "ఆపుస్తకం యింకా అచ్చుపడ లేదు." వా.
- 2. స్పష్టపడు.
- "సొ మ్మచ్చుపడంగ జేయుటకు." బ్రౌను. A 4. 187.
- "అచ్చుపడంగ బల్కుమీ." మను.
- "అనువు మెఱయజొచ్చి మాయ యచ్చు పడంగన్." పారి. 1. 107.
అచ్చుపడినట్లు
- సరిగ్గా అలాగే, రూపు గొన్నట్లు.
- "నెచ్చెలులు దన్ను గొలువగ, బచ్చ విలుతు కలిమి యెల్ల బద్మానమ యై, యచ్చుపడినట్లు మెఱయుచు, నచ్చట కేతెంచె భూబరాత్మజ నెమ్మిన్."
- భార. అర. అ. 7.