ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కృత____కృత 512 కృతి____కృప
- "కూళమారి విధాత చేకూర్చె నిటుల." ప్రబంధ. 655.
కృతపడు
- 1. కడచు.
- "కృతపడినకార్యంబు గ్రమ్మఱం బొడమునే...." భార. కర్ణ. 1. 226.
- 2. మరణించు
- "పనిచి కృతపడిన గాంగేయునిదెస." భార. ద్రోణ. 1. 6.
- 3. వే ఱగు.
- "సురకరి యీయద్రి జరియించు నేనిక, కొదమల గృతపడ్డకొదమ యొక్కొ." మార్క. 1. 97.
కృతపడ్డ తప్పు కాదు
- వెనకటి తప్పులను మాఫీచేయు - మన్నించు.
- "కృతపడ్డ తప్పు గాచితి నేడు." జైమి. 8. 94.
కృతపఱుచు
- గడపు.
- "...దినంబులు కడంద్రోచి....ఋతువులు కృతపఱచి..." సాంబో. 1. 173.
కృత మెఱుగు
- చేసినమేలు జ్ఞప్తి కుంచుకొను.
- "కృత మెఱుగుదు రుపకార,వ్రతమున వర్తింతురు...." భార. విరా. 3. 64.
కృతయుగపుమాటలు
- సత్య కాలపు మాటలు. తాతలనాటి సంగతులు.
- "....కృతయుగపు మాట లిపు డేల." నందక. 29.
కృతి యిచ్చు
- గ్రంథం అంకిత మిచ్చు.
- "కృతు లిచ్చినసుకవుల." రుక్మాం. 3. 66.
కృత్యాద్యవస్థ పడు
- మిక్కిలి కష్టముతో కూడినట్టి. ప్రారంభదశలోని ఇబ్బందులు పడు.
- కావ్యరచనలో ప్రారంభం చాలా క్లిష్టం అనుటపై యేర్పడిన పలుకుబడి.
- "అతగాడు వేలమీద పెట్టుబడి పెట్టాడు. ఎప్పుడో బాగానే వస్తుంది. ఇప్పు డేదో కృత్యాద్యవస్థ పడుతున్నా డంతే." వా.
కృప ఉట్టిపడగా
- దయారసము వెల్లివిరియగా.
- "ఆ బాలుర గృప, యుట్టి పడగ జూచి నృపతి యొయ్యన నగుచున్." కళా. 6. 160.
కృప చేయు
- అనుగ్రహించి యిచ్చు.
- "నీవు కృప చేసిన వీ రథచాపతూణముల్." జైమి. 4. 25.
కృపవాడు
- అనుగ్రహపాత్రుడు.
- "ఎవ్వడు తేజరిల్లు నత డెప్పుడు నీ కృప వాడు భార్గవీ!" వి.పు. 1. 203.
కృప సేయు
- అనుగ్రహించు; ఇచ్చు.
- "వి వేక పరిపాటియునుం గృప సేసె." హర. పీఠిక. 30.