ఈ పుట ఆమోదించబడ్డది
కంచు___కంట 327 కంట____కంట
కంచుమించుగ
- చెల్లాచెదరుగా.
- "కంచుమించుగ నడవి మెకముల గదుము నివిగో బలు సివంగులు." శుక. 1. 222.
- "కంచుమించుగ ధరణి గ్రక్కదల." సా. 1. 83.
కంచురాయి
- శబ్దించే ఒకవిధ మైనరాయి. బ్రౌను.
కంచెకోట
- కంచెగా కట్టినకోట; హద్దు; రక్షకము.
- చూ. కంచెగోడ.
కంచెగోడ
- చూ. కంచెకోట.
కంజాయింపుగా
- మంచి వసతిగా. అన్నీ అమరి ఉన్న వనుట.
- "వారి యిల్లు మంచి కంజాయింపుగా ఉన్నది." వావిళ్ళ.
కంటక మగు
- సరిపడని దగు, విరుద్ధ మగు.
- "ఇంట భుజించితిం గడగి యింటికి జేటు బొనర్చితిం దుదిం, గంటక మైతి నీమదికి గాసి ఘటించితి..." త్రిశంకుస్వర్గం. అం. 7. 82 పే.
- "నేనంటే వాడికి కంటక మయి పోయింది. ఎందుకో మఱి?" వా.
కంటక మాడు
- పరుషము లాడు.
- "అఱిమినను జివురునకు నగునె కంటక మాడ." మను. 3. 84.
కంటకములు పల్కు
- మనసు నొచ్చునట్లు మాట్లాడు, దూషించు.
- "కంటకంబులు పల్కు గా కేమి దీన." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 200.
కంటకురాలు
- క్రూరురాలు. కంటకము వంటిది.
- "ఆ, కంటకురాలు పల్కిన వికారపు మాటలు." నిరంకు. 3. 3.
కంట తడి బెట్టు
- దు:ఖించు.
- "వాళ్ల యింటాయనను తలచుకొని తలచుకొని ఆవిడ కంట తడిబెట్టు కొంటుంది." వా.
- రూ. కంట తడివెట్టు.
కంటద్దాలు
- సులోచనాలు.
- "కంటాద్దా లుంటేనే గానీ అత నో అక్షరం చదవ లేడు." వా.
కంటను వత్తి పెట్టుకొని
- అతిశ్రద్ధగా, ఎల్ల వేళల.
- "బ్రహ్మ మిత్రుండు శి,ష్యులకున్ గంటను వత్తి బెట్టుకొని యాయుర్వేద మోరంత ప్రొ,ద్దుల జెప్పన్ వినుచుండి." మను. 5. 7.
- కనులు మూతలు పడు నేమో యని వత్తులు వేసికొని యనుట. వాడుకలో నేటికీ ఉన్నది.
- "కంట వత్తి పెట్టుకొని ఆమె ఆ రోగికి సేవ చేసింది." వా.
- చూ. కంట వత్తిడుకొని.