పుట:PadabhamdhaParijathamu.djvu/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏఱు_____ఏలి 291 ఏలి____ఏలు

  • "ఆకు లేర్పరిచి కట్ట కట్టాలి." వా.

ఏఱు గుడిచి కాలువ పొగడు

  • "ఈతని నెఱుగకుంటే నిల స్వామి ద్రోహము, ఘాతల నేఱు గుడిచి కాలువ పొగడుట." తాళ్ల. సం. 9. 247.
  • చూ. ఏరు గుడిచి కాలువ పొగడు

ఏఱుగొను

  • వఱదపా లగు; పా డగు.
  • "వలరాజునకు నైన వర్ణింపగా దగు తనువిలాసం బేఱుగొనియె నన్న." ఉ. హరి. 4. 300.

ఏలనిబంటు

  • జీతనాతములు లేని సేవకుడు.
  • "ఈ తనూవిభవ మెక్కడ యేలని బంటుగా మరున్, డక్క గొనంగ రాదె యకటా! నను వీడు పరిగ్రహించినన్." మను. 2. 35.

ఏల యొక మాట మాటగ?

  • వరుసగా ఒక్కొక్కటీ చెప్పడం ఎందుకు?
  • "ఏల యొకమాట మాటగ నించు విలుతుడు...." రాజగో. 2. 55.

ఏలాట మాడు

  • చెరలాట మాడు.
  • వేంకటేశ. 35.

ఏలికతో మేలము

  • ప్రమాదకారి. యజమానితో హాస్యం ఎప్పుడో ప్రమాదం కలిగించుననుట.
  • వేంకటేశ. 52.

ఏలికబంటువాసి లేక

  • సేవ్య సేవక భేదము లేక; వాడూ వీడూ అనక. అనగా అందఱూ అనుట.
  • "ఏలికబంటువాసి యొక యించుక లేక కృశించువారు నై,తూలె జనంబు." కా. మా. 3. 153.

ఏలికసాని

  • యజమానురాలు.
  • గౌర. హరి. ద్వి. 2250.

ఏలిదము చేయు

  • చులకన చేయు.
  • "ఏలిదము చేసి మెచ్చక, తూలముగా బలికి కడవ దూషించెదు." కుమా. 7. 45.

ఏలినవాడు

  • ప్రభువు. పాండు. 5. 265.

ఏలినవారు

  • ప్రభువుల వారు.
  • "ఓహోహో! ఏలినవారు సిద్ధసంకల్పులు గారా?" హేమా. పు. 78.

ఏలుకొను

  • ఏలు; పాలించు. ఆమెనో, అతనినో పరిగ్రహించు. ప్రియా ప్రియుల, భార్యా భర్తల విషయంలోనే దీని ఉపయోగిస్తారు.
  • "ఏల సందేహ మమరేంద్రు నేలు కొనుము." నైష. 3. 126.