పుట:PadabhamdhaParijathamu.djvu/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏరు_____ఏరు 290 ఏరు_____ఏర్ప

ఏరు గట్టు

  • పాఱు, ప్రవహించు.
  • "ఇటుల మది రెండుదెఱగు లై యేరు గట్టు." లక్ష. 3. 85.

ఏరు గుడిచి కాలువ పొగడు

  • ఒకదానివల్ల లాభం పొంది మరొకచిన్న దానిని పొగడు.
  • "గరిమ నేరు గుడిచి కాలువ బొగడ బోతే, యెర వెరవే కాక యిత వయ్యీనా?" తాళ్ల. సం. 8. 67.

ఏరు తీసినట్టు

  • క్రమక్రమంగా కాకుండా ఒక్క ఉదుటున తగ్గిపోవు. ఒక్క గంటలో ఏరు మహోద్ధృతంగా దరు లొరసి పారుతుంది. అలాగే గబాలున ఒక్కమాటు తీసిపోతుంది.
  • "వాడి అంత ఆస్తీ సంవత్సరంలోగా ఏరు తీసినట్టు తీసిపోయింది." వా.

ఏరు దాటి తెప్ప కాల్చు

  • అవసరం గడచిన తర్వాత పోద్రోలు.
  • "దిక్కు లేనప్పు డేమో వాళ్లింట్లో తలదాచుకొన్నాడు. కాస్త ఆసరా చిక్కగానే అటు మొగం చూపడం కూడా మానేశాడు. ఏరు దాటి తెప్ప కాల్చే రకం." వా.

ఏరు దాటి పోవు.

  • తప్పించుకొని పోవు. దొరకక పోవు.
  • "ఈరసపు సంసార మింగలము దగిలించి, యేరు దాటిపోయె నెంతటి జాణే." తాళ్ల. సం. 5. 115.

ఏరు దాటేవరకూ గంగమ్మ - ఏరు దాటిం తర్వాత పింగమ్మ

  • అవసరం గడచేవరకూ పొగడ్తలు, అది తీరాక తెగడుటలు.
  • "వాని దంతా పని గడచేవరకే యీ ఆశ్రయింపు. ఆ తరువాత నీ యబ్బకు నా యబ్బ ఏం కావాలి అంటాడు. ఏరు దాటేవరకూ..." వా.

ఏరు నిద్రించు

  • అలలు లేక ప్రవహించు.
  • వేంకటేశ. 68.

ఏరుల కేతము లెత్తు

  • అసాధ్యకార్యములకు దిగు. ఏతముతో ఏటిలోని నీరంతా ఎత్తుట సాధ్యము కా దనుటపై ఏర్పడినది.
  • వేంకటేశ. 60.

ఏరు సాగు

  • ఏరువాక సాగు.
  • "చౌకుమళ్లునుం గా లలి నేరు సాగి రిల గల్గుపసిం గొని పేదమున్నుగన్." ఆము. 4. 124.

ఏర్పఱచు

  • దిద్ది తీర్చు; వేనిలో నైనా కలిసినవానిని వేఱుగా చేయు.
  • "ఫాలమున గుంతలంబు లేర్పఱచి నపుడు." హర. 4. 85.
  • "మా నాయనమ్మ మధ్యాహ్నంపూట బియ్యం యేర్పరుస్తూ కూర్చుంటుంది." వా.