పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము పరీక్షలో హిందూ మత మింకను అస్పృశ్యతను తొలగింపని ఎడల ప్రజాభిప్రాయము దానిని నిరాకరించుననుటకు ఎట్టి సందియములేదు.” 1* బహిరంగ సభలో 57 బంగారు ఉంగరములు, 26 గాజులు, ఒక బంగారు గొలుసు, బంగారు నాగరం, వజ్రము పొదిగిన చామంతి పువ్వు, కొన్ని సవరసులు, కొన్ని ఫ్రాంకులు, ఇతర ధనముతో పాటు "హరిజననిధి'కి చేకూరింది. గాంధీజీ హరిజనుల కోసం ఎర్రవాడ జైలునందు నిరాహారదీక్ష చేసినంత కాలం ఆయన ఉద్యమం పట్ల సానుభూతితో ఉపవసించిన చెన్నాబత్తుల వీరాచారి గాంధీజీకి ఒక వెండి పళ్ళెము, ఒక వెండి గిన్నె ఒక వెండి గోవును సమర్పించారు. గాంధీజీ సాయంకాలము 6 గం|లకు ముందే సమావేశాన్ని ముగించి గాంధీ జాతీయ విద్యాలయమునకు వెళ్ళి ఆహారము తీసుకొన్నారు. భోజనానంతరము హరిజనవాడలు చూచుటకు మోటారులో వెన్నవల్లివారిపేటకు వెళ్ళారు. హరిజనవాడలు సందర్శించుట వెన్నవల్లివారిపేటలోని హరిజనులు గాంధీజీని మంగళ వాయిద్యాలతో హరిజన స్వచ్ఛంద సేవకులతో ఎదురేగి ఆహ్వానించి సభావేదికకు తీసుకొని వెళ్ళారు. మహాత్ముడు వేదికపైన కూర్చుండగనే జె. శకుంతల చేసింది. తదుపరి గాంధీజీ కొంతసేపు హరిజన కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెల్లంకి కృష్ణమూర్తి, రాయిడు గంగయ్య మొదలయిన గ్రామపెద్దలు గాంధీజీకి పరిచయము చేయబడిరి. అప్పడు ఒక విద్యార్థి 'ఈ హరిజన నిధి నుండి కొంత ನಿ'ಮಿಯ್ಯನಿು హరిజన ವಿದ್ಯಾಭ್ದಲು, ఇక్కడ ఉన్నత విద్య అభ్యసించుటకు, విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించుటకు వినియోగించవలసినది" అని కోరగా గాంధీజీ విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించినంత మాత్రాన దేశానికి, సంఘానికి మేలు కలుగదని, స్వదేశీ పరిశ్రమలను అభివృద్ధి పరిచే విద్యయందే నేటి యువకులు ఉత్తీర్ణులు కావలసి ఉందనీ, అందుకు ప్రయత్నించవలసిందనీ వారికి ఈ నిధి ద్వారా సహాయము జరుగుతుందనీ చెప్పారు. హరిజనులు పరిశుభ్రంగా ఉండవలెనని, తాగుడు మొదలయిన దురలవాట్లను వదులుకొనవలెనని ప్రబోధించారు. రీ తరువాత హరిజన నాయకుడగు రాయిడు గంగయ్య నాయకత్వంలో హరిజనులు గాంధీజీని సన్మానించిరి. 200 మంది హరిజన యువకులు. తెల్లని దుస్తులతో సబ్చే పోతయ్య శిక్షణలో గాంధీజీకి 'గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. గాంధీజీ వారి ఇండ్లను. పరిశుభ్రతను చూచి చాలమెచ్చుకున్నారు. వారు తమ స్వశక్తితో, స్వయంకృషి, స్వయం సహాయముతో ఏర్పాటుచేసుకొనిన ਤੂੰ360 నందలి గ్రంధాలయము, వ్యాయామశాల, పాఠశాల, ఔషధాలయము, హరిజన వాటాదారుల పెట్టుబడిచే కొనసాగించబడుతున్న