పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

కో-ఆపరేటివ్ బ్యాంకు, భజన సంఘము, శుద్ధి సంఘములను గాంధీజీకి చూపించారు. గాంధీజీ వారి కృషిని ప్రశంసిస్తూ, "మీరు ఇతర హరిజనులకు మార్గదర్శకులైయున్నారు" అని ప్రశంసించారు.

తరువాత గాంధీజీ జాతీయ పాఠశాలకు వెళ్ళి ప్రార్ధన జరిపారు. ప్రార్థన ముగిసిన వెంటనే శ్రీమతి జవ్వాజి రాజరత్నం, దాసరి కృష్ణవేణమ్మ స్త్రీల వద్ద నుండి తెచ్చిన కానుకలను గాంధీజీకి సమర్పించారు. అంతలో 90 ఏండ్లవయసు గల ဖဲ့)မွီ పండితుడు గాంధీజీని కలుసుకొన్నాడు. ఆయన నడవలేని స్థితిలో ఉన్నందున ఆయనను గాంధీజీ గదిలోనికి ూసుకొని రావలసి వచ్చింది. ఆయన గాంధీజీని దర్శించి వేద వాక్యములచే మహాత్ముని హృదయపూర్వకముగా దీవించి "నీవు ప్రారంభించిన అస్పృశ్యతా నివారణోద్యమం దైవ ప్రేరణ"అని శాఘించాడు. తరువాత ఒక వృద్ధ స్త్రీ కూడా గాంధీజీని దర్శించింది. ఆమె తనకుటుంబములో ఐదవ తరంవారిని చూడగలిగింది. ఆవయసులో కూడా ఆమె నూలు స్వయంగా వడికి తన మనుమలకు, ముని మనుమలకు మునిమను మల బిడ్డలకు కూడ ఖద్దరు బట్టలు సరఫరా చేస్తూన్నది. ఆమె కూడ గాంధీజీ అంటరానితనం తుడిచి పెట్టడానికి చేస్తూన్న కృషిని ఆశీర్వదించివెళ్ళింది. గాంధీజీ ఈ ఇద్దరి వృద్ధమూర్తుల ఆశీర్వాదాలను అందుకో గలిగినందుకు చాలా ఆనందించారు. ప్రజా హృదయం మొత్తం మీద నిష్కళంకంగా ఉన్నదని నిర్ణయించడానికి ఈ రెండు ఉదంతాలు చక్కని నిదర్శనాలు. రాత్రి 9గంటలకు గాంధీజీ నిద్రించారు.

శాసనోల్లంఘన జరుగుతున్న రోజులలో 'గాంధీ జాతీయ విద్యాలయం' కాంగ్రెసు శిబిరంగా ఉన్నందువలన ప్రభుత్వం ಮಾಯಿ ದಾನಿನಿ స్వాధీనం చేసుకొన్నారు. అప్పటినుండీ అది వెలవెలపోతుండేది. ఈ సందర్భంగా అందు గాంధీజీ మరల బసచేసిన తరువాత నూతన కళతో వెలుగొందింది. గాంధీజీ విద్యాలయంలో రాత్రి విశ్రాంతి తీసుకొంటుండగా స్వచ్ఛంద సైనికులు ఆ రాత్రంతా మేలుకొని జాగరూకత వహించారు.

గాంధీజీ 28వ తేదీ తెల్లవారు. జామున 4 గం|లకు చేసిన ప్రార్ధనలో అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. reo68 భగవద్గీతలోని 18వ అధ్యాయం పారాయణం చేశారు. తరువాత గాంధీజీ ఆహ్వాన సంఘకార్యదర్శిని శ్రీమతి మదుల దమయంతీదేవికి యన్.సి.హెచ్. రంగనాయకీ దేవికి, యం. స్వరాజ్యలక్ష్మికి, న్యాయవాదియగు బులుసు నరసింహం పంతులుకు, ఎ. చక్రధరరావుకు దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారి హిందీ పరీక్షలలో ಮಿ೩ುಲುಗ್ ఉత్తీర్ణులైనందుకు వెండి పతకాలను బహుకరించారు.

తరువాత తులాబందుల సుబ్బారావు,తన భార్యాపత్రునితోను వచ్చి రూ.116/–లున్నూ దామరాజు ಲÊಮಿ రూ.1 16/-లున్నూ గాంధీజీకి హరిజననిధి సమర్పించారు. తరువాత