పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిచయ వాక్యం

ఆచార్య బి. కేశవనారాయణ.
చరిత్ర మరియు
ఆర్కియాలజీ శాఖాధిపతి , (రిటైర్డ్)
ఆంధ్రవిశ్వవిద్యాలయం
విశాఖపట్నం.

గాంధీజీ రాజకీయరంగప్రవేశం చేసి కాంగ్రెస్ కు నాయకత్వం వహించిన తర్వాత భారత స్వాతంత్ర్యోద్యమ స్వరూపస్వభావాలు మారినవి. అంతకు పూర్వం ఉన్నత వర్గాలకు చెందిన వారు మాత్రమే కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొనేవారు. అందువల్ల కాంగ్రెస్ కు లభించిన మద్దతు - పరిమితంగా ఉండేది. కాని గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెస్ నిర్వహించిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం ప్రజాఉద్దమంగా మారింది. ఈ పరిణామం గాంధీజీ అన్నివర్గాల వారి మద్దతు కూడ గట్టడానికి అవలంభించిన పద్దతుల పర్యవసానమే , ముఖ్యంగా మహిళలు నిమజాతుల వారిని ఆకర్పించడానికి కాంగ్రెస్ విధానములో మారులు అవసరమైనాయి. ఈలక్షసాధనకు గాంధీజీ మిగిలిన ప్రాంతాలనేగాక పశ్చిమగోదావరి జిల్లాలో కూడా పర్యటించారు. 1921లో తిలక్ స్వరాజ్యనిధికి విరాళాలకై పర్యటించారు. 1929 లో ఇద్దరు ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి పర్యటించారు. బహింరంగ సభలలో ప్రసంగించి ఇద్దరు సందేశాన్ని ప్రజలకు వినిపించారు. ఇద్దరును ఉత్తత్తి చేయమని , ఇద్దరు అమ్మకాలను ప్రోత్థాపించమని , ఈ కార్యక్రమం అమలైతే అందువల్ల కొంతమందికి ఆర్థిక స్వావలంబన లభిస్తుందని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం అమలైతే విదేశీ వస్త్రాలకు గిరాకీ తగ్గి ప్రభుత్వానికి రావలసిన ఆదాయం కూడా తగుతుందని పర్యవసానంగా ప్రభుత్వం ఆర్థికంగా బలహీనపడుతుందని చెప్తారు. 1933 లో జరిపిన పర్యటనలో హరిజనులుహిందూసమాజానికి చెందిన వారనీ, వారిని ఉద్దరించడం ప్రతివారి