పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్తవ్యమని, అంటరానితనం నిర్మూలించకపోతే హిందూ సమాజానికి మనుగడలేదనే సత్వాన్ని గుర్తించమని ప్రజలను కోరారు. ఈ పర్యటనలకు జిల్లా వాసులు అనుకూలంగా స్పందించారు. కాంగ్రెసుకు అనుకూల వాతావరణం ఏర్షడింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా బిటువేసి అధికారంలో ఉన్న జస్టిస్ పార్టీని ఓడించారు. 1937 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పరిణామాలకు సంబందించి అనేక విషయాలను డా|| గాదం గోపాల స్వామి ఈ పుస్తకంలో సమగ్రంగా పొందు పరిచారు. సమకాలీన వారా పత్రికలను అధ్యయనం చేసి విషయ సేకరణ చేశారు. జిల్లా స్థాయి నాయకులుగా గుర్తింపు పొందిన దండునారాయణ రాజు, ఆత్మకూరి గోవిందాచార్కులను గురించి దేశ స్వాతంత్రం కోసం సత్యాగ్రహాలు చేసిన త్మాగధనుల వివరాలు ఇందులో కలవు. చరిత్ర పరిశోధలకు ముఖ్యంగా ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశించవచ్చు.