పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము- SSSSSSSSSSSSSSSSSS

తరువాత గాంధీ సాయంత్రం 7గం|లకు ఏలూరు సమీపమునందలి చాటపర్రు గ్రామానికి వెళ్ళారు. అచ్చట రూ.900/-డబ్బు సంచిని గ్రామస్తులు (YPටඨිසීෂී ෂටරඹීපෙරය. ( \ට්ටඨිසී చిరునవ్వుతో అది వెయ్యినూట పదహార్లు మొత్తం చేయక పోతే సత్యాగ్రహం చేస్తానన్నారు. మాగంటి సుబ్రమణ్యంగారి కుమారై శ్రీమతి ఎర్నేని ఇందిరా దేవి అమిత ఆనందముతో రూ. 116/– గాంధీజీకి స్వయంగా ಇವಲ್ಟರು. గాంధీజీ ఆమెను 'అమ్మా స్వదేశాభివృద్ధికి కష్టపడగలవా" అని అడుగుగా ఆమె అత్యుత్సాహముతో తన పతి ఆజ్ఞానుసారం సంసిద్దురాలనని పలికినది. గాంధీజీ కోరిన మొత్తం రూ.1.116/- పూర్తి అగుటతో రాత్రి 8గం|లకు తిరిగి ఏలూరు చేరారు. 11 ఏప్రియల్ 23వ తేదీన వసూలైన మొత్తం రూ. 8,990/- మరియూ రెండు వేల రూపాయల విలువైన నగలు కూడా ఖద్దరు నిధికి చేకూరాయి. మాగంటి బాపినీడు తనవివాహం రోజున అన్నపూర్గాదేవి తన వేలికి అలంకరించిన ఉంగారాన్ని కూడా గాంధీజీకి సమర్పించారు.

ఏప్రియల్ 24వ తేదీ ఉదయం మబ్బులు వేసిన చల్లగాలిలో ఏలూరుకు 16 మైళ్ళు దూరాన ఉన్నచింతలపూడి తాలూకాలోని ధర్మాజీగూడెమునకు గాంధీజీ వెళ్ళారు. అచ్చట గాంధీజీకి పరిసర గ్రామస్తులు, స్థానిక కో-ఆపరేటివ్ యూనియన్వారు సన్మానపత్రం సమర్పించారు. ఆ సన్మానపత్రాన్ని వేలం వేయగా ఎనిమిది రూపాయలు వచ్చాయి. ఒక స్త్రీ రూ.30/- విలువగల నాగరాన్ని ఇచ్చినది. ఖద్దరు నిధికి ఆసభలో రూ. 1116/– చేకూరాయి. గాంధీజీ ఆ సభలో ఖద్దరు, వివిధ వర్గాల ఐకమత్యము, అస్పృశ్యతా నివారణము, మద్యపాన నిషేధములపై ఉపన్యసించారు. ఏలూరు నుండి ధర్మాజీగుడెం వెళ్ళెడి మార్గమునందున్న శనివారపు పేట గ్రామస్తులు సన్మానపత్రాన్ని రూ. 154/– ఖద్దరు నిధిని సమర్పించారు. విజయరాయ్లో రూ.119/-, నడుపల్లిలో రూ.316/– ఖద్దరునిధి చేకూరింది. 14 తరువాత తిరిగి ఏలూరు గాంధీ జాతీయ విద్యాలయమునకు చేరుకొన్నారు. సాయంత్రం 3గం| వరకు అచ్చట విశ్రాంతి తీసుకొన్నారు. తదుపరి తనను చూడవచ్చిన దివాన్ బహదూర్ మోచర్ల రామచంద్రరావు పంతులు గారితోను, పెద్దలు, కార్యకర్తలతోను ఒక గంట ముచ్చటించారు. ఆ సందర్భములో "విదేశీ వస్త్రములు ధరించిన బాలబాలికలను బడికి రానీయవదు. ప్రభుత్వము నుండి ఏవిధమయిన ధనసహాయము విద్యాలయము పొందరాదు. ఏ సందర్భము నందునూ ప్రభుత్వం టెక్నికల్ పరీక్షలకు ವಿದ್ಯೇಯ್ದಿಲು వెళ్ళుటకు అనుమతినీయరాదు. స్వతంత్ర వృత్తితో జీవించుటకు పనికివచ్చు వృత్తి విద్యలు నేర్పవలెను" అని వివరించారు. కొందరి ప్రశ్నలకు జవాబుగా