పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

హృదయాంతరాళములందలి ఒక్క భావమును మాత్రము వెలిబుచ్చుటకు తమయనుజ్ఞ వేడుచున్నాము. తాము తమ గంభీర సత్య ప్రేమసాధనముచే అనుపమానమగు ఆత్మోన్నతిని, దివ్యశక్తినిగడించి, విశ్వజగత్తు యొక్క అందు ముఖ్యముగా భారతీయులయొక్క గౌరవమును విధేయతను చూరగొంటిరి.

6. ప్రియమైన మనమాతృ దేశమును విదేశదాస్యమునుండి విముక్తి నొందించి సత్వరస్వరాజ్యస్థాపన యొనరించునట్లు భగవానుడు తమకు బలమును, శక్తిని అనుగ్రహించు గాక అని ప్రార్థించుచున్నాము.

- ఏలూరు పురవాసులు

" కొండా వెంకటప్పయ్య అనువాదము చెప్పచుండగా, గాంధీజీ తన ఉపన్యాసములో మీరు నాకు అనేక స్వాగత పత్రములు, ఖద్దరు నిధికి ధనమును ఇచ్చినారు. అందులకు నా వందనములు. నేను ఏలూరు వచ్చినప్పడు తీరని దుఃఖముకలిగింది. దానిని వెలిబుచ్చక ఉండలేను. అదేమనగా స్వర్గసురాలయిన ಅನ್ನಿಪು'ರಾದೆವಿನಿ నేను ఈ రోజున మీ మధ్య చూడజాలక పోవుటయే. నేను బెజవాడ సభలో నున్నప్పుడు (1921 సం||లో) ఆమె నన్ను చూచి కాపాడింది. ఆ సంఘటనను నేనెన్నడూ మరిచిపోలేను. అప్పడే ఆమె తన సర్వ ఆభరణములు తిలక్నిధికి ఇచ్చివేసింది. নত০55 జ్ఞాపకమున్నంత వరకూ తన విలువైన ఆభరణములన్నింటినీ 'తిలక్ స్వరాజ్యనిధి' కి సమర్పించిన ఏకైక భారతీయ మహిళ అన్నపూర్గాదేవి. అప్పడు నాకు గలిగిన పరమానందము చెప్పలేను. నాటి నుండి మరణించేంత వరకూ ఆమె ఎన్ని కార్యక్రమములు చేసినదో చెప్పలేను. భారత దేశంలో అదృష్టవశాత్తు నేను అనేకమందిని కుమార్తెలుగా భావిస్తూన్నాను. ఈమె నా బిడ్డలలోకెల్లా ఉత్తమురాలు. తన భర్త అమెరికాలో ఉన్నప్పటికినీ હ9ઠo తనపట్టుచీరలు, విదేశీవస్తువులు నన్నింటినీ విసర్జించుట సామాన్యమైన పనిగాదు. ఆమె దేశాభిమానము, త్యాగశీలము వర్ణింపనలవికాదు. మీరు నిజముగా ఆమెను ఆదర్శంగా తీసుకొన్నట్లయితే ఎన్నటికీ ಖಡೆಶಿ వస్త్రములు ధరింపరు. నేను ఏలూరు వచ్చుచున్నప్పుడు అనేకులు ఖద్దరు ధరించుట నేను చూడలేదు. ఎవరైతే విదేశీ వస్తాలు ధరించినారో వాటిని విడనాడి ఖద్దరు ధరించవలెనని ప్రార్థించుచున్నాను. అస్పృశ్యతను మీరు విడనాడండి. అన్నపూర్ణ జన్మించిన ఈ ప్రదేశములో ఆమెను మీరు స్మరించుచున్నట్లయితే అస్పృశ్యతను విడనాడుదురుగాక. కొందరు అస్పృశ్యులునావద్దకు వచ్చారు. వారికిని మీకును భేదములున్నట్లు నాకు కనిపించలేదు. భాషలో కూడ వారికి, మీకు భేదము కన్పించలేదు. మీలోవలెనే వారిలో