పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము



3. ఖద్దరు యాత్ర 1929

సహాయనిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమము సంయుక్తముగా నిర్వహించ బడుతున్నప్పటికీ హిందూ, ముస్లింల మధ్య మతకల్లోలాలు ప్రారంభమైనవి. 1921 ఆగష్టులో మలబారు ప్రాంతములో మెప్లా అనే ముస్లిం తెగవారు బ్రిటీషు వారినే కాక అనేక మంది హిందువులను కూడ చంపారు. 1922 ఫిబ్రవరి, 5న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ జిల్లా యందలి చౌరీచౌరాలో ప్రభుత్వ దమననీతితో కోపోద్రిక్తులయిన కొందరు ప్రజలు పోలీసు స్టేషనుపై దాడిచేసి ఒక సబ్ ఇనస్పెక్టరును, ఇరవై ఒక్కమంది కానిస్టేబుల్లను సజీవదహనం చేశారు. ఉద్యమం హింసాయుతంగా మారటంతో గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని విరమించటంతో ముస్లిం, కాంగ్రెస్ వర్గాలన్నింటిలోను, ప్రజలలోను తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఇట్టి స్థితిలో అదను చూసి ప్రభుత్వం మహాత్ముని 1922 మార్చిలో అరెస్టుగావించి ఆరుసంత్సరాలు శిక్ష విధించింది. కాని గాంధీజీని అనారోగ్యకారణములపై 1924 ఫిబ్రవరిలో విడుదల చేసింది.

1924 లో గాంధీజీ యర్రవాడ జైలునుండి విడుదలైనప్పటి నుంచీ ఆంధ్రదేశ నాయకులు ఆయనను తమ రాష్ట్రానికి రావలసినదిగా ఆహ్వానిస్తూ వచ్చారు. కాని ఆయన ఏవో కొన్ని పరిస్థితులలో ఆంధ్రదేశానికి రాలేక పోవటం జరిగింది. ఆంధ్రనాయకులలో కొన్ని భేద భావాలు కలగటం ఆంధ్రులలో బహునాయకత్వం ఉందని గాంధీజీ విమర్శించటం కూడ జరిగింది. అందుచే గాంధీజీ ఆంధ్రరాష్ట్రాన్ని బహిష్కరించారా! అనే అపోహకూడ కొంతమంది ఆంధ్రులకు కలిగింది. ఆ భావాన్ని తొలగించేందుకు గాంధీజీ 1927 జూన్ 16వ తేదీ 'యంగ్ ఇండియా' లో ఈ విధంగా వ్రాశారు." విూ సంచార కార్యక్రమములో ఆంధ్ర రాష్ట్రం సంగతి కనబడటం లేదు అందుచే మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని బహిష్కరించారా? అని చాలామంది నన్ను అడుగుతున్నారని కొండా వెంకటప్పయ్య గారు నాతో అన్నారు” “ఆంధ్రులపై నాకుగల చిరకాలప్రేమ వలన వారికీ నాకు ఉన్న సంబంధమును నేనెన్నటికీ మరువలేను. కొంతమంది ఆంధ్రులు నన్ను విసిగిస్తూన్నప్పటికీ, నేను ఆంధ్ర దేశమును బహిష్కరించవలెననుకొన్నా బహిష్కరించలేను. ఆంధ్రులు చాలామంచివారు. వారికి మిక్కిలి దేశాభిమానం ఉంది......... ఈ పర్యాయము

31