పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

తోటల వ్యవసాయదారుల సమస్యలను పరిష్కరించటంలో ఆయన చూపిన చొరవ, తెగువ, గుజరాత్లోని కైరాజిల్లాలో వ్యవసాయదారుల సమస్యలను పరిష్కరించుటకు చేపట్టిన సత్యాగ్రహం, అహ్మదాబాదు మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారమునకు ఆయన చేపట్టిన సమ్మె తదుపరి నిరాహార దీక్ష అద్భుతమైన విజయాన్ని సాధించాయి.

గాంధీజీ భారతదేశంలో చేపట్టిన ఈ మొదటి ప్రయోగాలు పామర జనానికి, గ్రామీణ ప్రాంతములలోని కర్షకులకు, పట్టణములందలి కార్మికులకు ఆయనను సన్నిహితం చేశాయి. గాంధీజీ నిరాడంబరమైన అలవాటు, ఇంగ్లీషు కన్నా భారతీయభాషలను ఎక్కువగా ఉపయోగించడం, మతగ్రంధాలను ఉట్టంకిస్తూ ఉపన్యసించడం, సునిశితమైన పదజాలాన్ని వాడటం, కార్మిక, కర్షకసమస్యలకు స్పందిస్తూ ఆయన సాగించిన సఫలీకృతమైన ఉద్యమాలు ప్రజలపై ప్రగాఢ ప్రభావాన్ని కలిగించాయి. ఆవిధంగా గ్రామీణ సామాన్య ప్రజానీకంతో పూర్తిగా తాదాత్మ్యంపొందిన నాయకులు బహుశ గాంధీజీ ఒక్కరే అని చెప్పవచ్చును. గాంధీజీ తన వ్యక్తిగత జీవితాన్ని గ్రామీణులకు సుపరిచితమయిన పద్దతులలో తీర్చిదిద్దు కున్నారు. వారికి సులభంగా అర్థమయ్యేభాష మాట్లాడారు. అతి స్వల్ప కాలంలో ఆయన భారత దేశమునందలి గ్రామసీమలలో నివసించే పేదవారికి, అట్టడుగునపడి ఉన్న పామర జనానికి నారాయణుడైనారు. ఆయన దేశవిముక్తి కలిగించుటకు అవతరించిన మహాత్ముడని ఋషితుల్యుడని, సామాన్యమానవులకు సేవచేయుటయే జీవిత పరమార్థంగా కలిగినవాడని, ప్రజలు భావించారు. అట్టి వ్యక్తి ఆదేశించిన పిలుపునకు హృదయపూర్వకంగా స్పందించటం తమ ధర్మమని వారు విశ్వసించారు. దానికి బ్రిటీషు ప్రభుత్వం పట్ల వివిధ వర్గాలలో ఏర్పడిన అసంతృప్తి తోడైనది. ప్రజలలో అసంతృప్తి లేనప్పడు నాయకుడెంతటివాడైన వారిని ఉద్యమాలలో పాల్గొనేటట్లుచేయలేడు. ప్రజల అసంతృప్తి, వారిని నడిపించగల నాయకుడు ఈ రెండూ కలిసి ఉద్యమానికి మార్గాన్ని సుగమం చేశాయి. ఆ విధముగా ఆయన భారతీయులకు వాస్తవమైన ప్రతినిధి అయినారు.

అదే సందర్భములో ప్రపంచ యుద్దానంతరం బ్రిటీష్ ప్రభుత్వం రౌలట్ బిల్లలను ప్రవేశపెట్టి భారత పౌరుల హక్కులను శాంతి సమయంలో కూడా హరించతలపెట్టింది. ఈ బిల్లలు చట్టములుగా ජාපඬිවරයිජ් సత్యాగ్రహోద్యమం ప్రారంభిస్తానని గాంధీజీ ప్రకటిం చారు. అయినప్పటికీ ప్రభుత్వం రౌలట్ చట్టాలను ఆమోదించింది. గాంధీజీ సత్యాగ్రహోద్యమా నికి పిలుపునిచ్చారు. దీనిప్రకారం దేశప్రజలంతా 1919 ఏప్రియల్ 6వ తేదీన సార్వత్రిక హరాజ్ జరపాలి, అత్యవసరమైన పనులు తప్ప మిగిలినవన్నీ స్తంభింపచేయాలి. గాంధీజీ పిలుపుననుసరించి ఆంధ్రరాష్ట్రంలో సమావేశాలు జరిపారు. ప్రశాంతంగా హరాళ్ నిర్వహించారు. కాని పంజాబులో కాంగ్రెసు మహాసభ జరగవలసి ఉండగా ముందుగానే డాక్టర్ కిచూ, డాక్టర్ సత్యపాల్లను ప్రభుత్వం నిర్బంధించింది. గాంధీజీ పంజాబులో