పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

ప్రవేశించరాదని ఆంక్షలు విధించింది. ఏప్రియల్ 13వ తేదీన ప్రభుత్వ చర్యకు నిరసన తెలిపేందుకు జలియనువాలాబాగ్లో బహిరంగ సమావేశం జరిగింది. జనరల్ డయర్ సైనికులతో వచ్చి మందుగుండు సామగ్రి అంతా అయ్యేంతవరకూ కాల్పులు జరిపాడు. వేయిమంది పైగా ప్రజలు మరణించారు. అనేకులు గాయపడినారు. క్రమంగా ఈ ఉదంతం దేశమంతా వ్యాపించింది. ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. దేశములోని పత్రికలన్నీ ఈ దురాగతాల్ని నిశితంగా విమర్శించాయి. అదివరకటి మితవాద జాతీయనాయకులు అనేక మంది కూడా యిప్పడు గాంధీజీ బలగంలో చేరిపోయారు. పంజాబు విషాదగాధ గాంధీజీని భారత రాజకీయాలలో అగ్రగామిని చేసింది.

హిందూ ముస్లిం ఐక్యతకు, పంజాబు దురంతాలకు నిరసన తెలియచేయటానికి గాంధీజీ చూపిన అహింసాయుత, సహాయనిరాకరణ ఉద్యమ మొక్కటే మార్గమని దేశప్రజలు భావించారు. 1920 సెప్టెంబరు, 4న కలకత్తాయందు, డిశంబరు, 26న నాగపూర్ నందు సమావేశమయిన కాంగ్రెసు మహాసభ గాంధీజీ పిలుపుననుసరించి శాంతియుతంగా, స్వరాజ్యం సాధించాలని తీర్మానించింది. నాగపూర్ సమావేశం కాంగ్రెసు సంస్థకు ఒక నూతన నియమావళిని ఇచ్చి దాని స్వరూపాన్నే మార్చివేసింది. త్యాగాలకు సిద్ధంకావాలని ఎన్నికలను, ప్రభుత్వ న్యాయస్థానాలను, విద్యాసంస్థలను, ఉద్యోగాలను, విదేశీ వస్రాలను, మధ్యం , దుకాణాలను బహిష్కరించాలని, నిర్మాణాత్మకమగు ఖాదీ ఉత్పత్తి, అస్పృశ్యతా నివారణ, జాతీయ పాఠశాలలు, పంచాయితీ కోర్టులు ఏర్పాటు చేసుకోవాలని కోరటం జరిగింది. దేశప్రజలు తనతో సహకరిస్తే సంవత్సరంలో స్వరాజ్యం సాధిస్తానని గాంధీజీ ఇచ్చిన హామీ ప్రజలలో విద్యుత్ ప్రవాహం వలె పనిచేసింది. దేశమంతటా ఇంతకు ముందెన్నడూ ಪ ఉత్సాహం వెల్లివిరిసింది. ఉన్నత వర్గాలవారు, దిగువవర్గాలవారు, పురుషులు, స్త్రీలు, హిందువులు, ముస్లింలు, సనాతనులు, అధునాతనులు అందరూ సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. అనేకమంది మహిళలు ఘోషావదలిపెట్టి స్వాతంత్ర్యసమరంలో చేరారు. తమ ఆభరణములను తిలక్ స్వరాజ్యనిధికి సంతోషముగా సమర్పించారు.

1921 మార్చి 31, ఏప్రియల్ 1న అఖిలభారత కాంగ్రెసు సంఫుసమావేశము విజయవాడలో జరిగింది. గాంధీజీ, మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్, పటేల్తో సహా అనేకమంది జాతీయ నాయకులు విచ్చేశారు. వారిని దర్శించి ఉత్తేజం పొందటానికి రెండు లక్షలకుపైగా ప్రజానీకం వెలువగా విజయవాడకు వివిధ వాహనములపైననూ, పాదయాత్రలు చేసుకొంటూనూ వచ్చారు. రెండు రోజులు నాయకులను చూచి, సందేశాలు విని, వారి స్వస్థానములకు వెళ్ళి, తాము విన్నదీ, కన్నదీ ప్రజలలో యథాశక్తి ప్రచారం చేశారు. ఆ సమావేశాలలో పశ్చిమగోదావరి జిల్లా గాంధీజీ సృతిపథంలో నిలిచిపోయే రెండు సంఘటనలు జరిగాయి. అవి, మొదటిరోజు సాయంత్రం అసంఖ్యాకమగు ప్రజలు