పుట:Oka-Yogi-Atmakatha.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

ఒక యోగి ఆత్మకథ

తకు భంగం కలిగించేలా ఎదురయినట్లయితే, నేను మా గురువుగారి పాదాల దగ్గర ధ్యానం చేసేవాణ్ణి. అక్కడ నాకు, చాలా సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్థితులు కూడా అందుబాటులోకి వచ్చేవి. ఆయనకంటే తక్కువస్థాయి గురువుల దగ్గర మాత్రం ఆలాటి అనుభూతులు కలిగేవి కావు. ఆ మహానుభావులు ఒక సజీవమైన దేవాలయం; దాని రహస్య ద్వారాలు, భక్తితో ప్రవేశించే శిష్యులందరి కోసం తెరుచుకొని ఉండేవి.

“లాహిరీ మహాశయులు, పవిత్ర గ్రంథాల్ని గురించి పుస్తక పాండిత్యంతో వ్యాఖ్యానించేవారు కారు. అప్రయత్నంగానే ఆయన, ‘దివ్య గ్రంథాలయం’లోకి మునిగేవారు. ఆయనలోని సర్వజ్ఞత్వమనే నీటి బుగ్గలోంచి మాటలనురుగూ ఆలోచనల తుంపరలూ పైకి చిమ్ముకొస్తూ ఉండేవి. అనేక యుగాలకు పూర్వం వేదాల్లో[1] మరుగుపడి ఉన్న గాఢమైన దార్శనిక శాస్త్రాన్ని బయల్పరిచే అద్భుతమైన కీలకం ఆయన దగ్గర ఉండేది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన వివిధ చేతన స్థాయిల్ని వివరించమని అడిగినప్పుడు, ఆయన చిరునవ్వు చిందిస్తూ అంగీకారం తెలిపేవారు.

  1. సనాతనమైన నాలుగు వేదాలకు, ఇప్పటికీ 100 పై చిలుకు ప్రస్థాన గ్రంథాలున్నాయి. ఎమర్సన్ తన ‘జర్నల్’లో వైదిక భావనకు ఈ విధంగా జోహార్లు అర్పించాడు : “అది ఉష్ణం మాదిరిగాను, రాత్రి మాదిరిగాను, అలలులేని కడలి మాదిరిగాను మహత్తరమైనది. ఇందులో ప్రతి ధార్మిక భావనా ఉంది; ఉదాత్త కవితాహృదయం గల ప్రతి కవి మనస్సులోనూ పర్యాయక్రమంలో మసిలే మహత్తరమైన నీతులన్నీ ఉన్నాయి.... ఈ గ్రంథాన్ని ఉపేక్షించగూడదు. నా మట్టుకు నే నొక్కణ్ణి, అరణ్యంలోనో సరస్సులో ఒక నావలోనో ఉన్నట్లయితే ప్రకృతిమాత ఇప్పుడు నన్నొక బ్రాహ్మణ్ణి చేస్తుంది; అనంతమైన ఆవశ్యకత, శాశ్వతమైన నష్టపరిహారం, అగాధమైన శక్తి, అఖండమైన మౌనం...ఇదీ దాని ఉద్గోష. శాంతి, పరిశుద్ధత, సంపూర్ణ పరిత్యాగం అన్న సర్వవ్యాధి చికిత్సకాలు, పాపాలన్నిటినీ పరిహరించి, నన్ను అష్టదేవతల ఆనంద ధామానికి తీసుకు వెళ్తాయని అది చెబుతూంది.