పుట:Oka-Yogi-Atmakatha.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం

67

“నేను ఆ స్థితుల్లోకి ప్రవేశించి నాకు గోచరించింది. చెబుతాను మీకు,” అనే వారు. కేవలం గ్రంథాలు బట్టీపట్టేసి తమ అనుభవంలోకి తెచ్చుకోని భావాల్ని వెల్లడించే ఉపాధ్యాయులకూ ఆయనకూ చాలా తేడా ఉండేది.

“ ‘నీకు తోచిన అర్థాన్నిబట్టి శ్లోకాలు వ్యాఖ్యానించు’, అంటూ మితభాషులయిన గురువుగారు దగ్గురున్న ఒక శిష్యుడితో తరచుగా అంటూండేవారు. ‘నువ్వు సరయిన వ్యాఖ్యానం చెప్పే విధంగా నీ ఆలోచనల్ని నేను ప్రేరేపిస్తాను,’ అనేవారు. ఈ ప్రకారంగా లాహిరీ మహాశయుల అనుభూతులు అనేకం గ్రంథస్థం కావడం జరిగింది. వాటిమీద ఎందరో శిష్యులు పెద్దపెద్ద వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు.

“గుడ్డి నమ్మకం పెట్టుకోమని గురువుగారు ఎన్నడూ చెప్పలేదు. ‘మాటలన్నవి కేవలం పైపై తొడుగులు,’ అనే వారాయన. ‘ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించు.’ ”

“శిష్యుడికి ఏ సమస్య ఎదురయినా సరే, దానికి పరిష్కారంగా ఆయన, క్రియాయోగం సాధన చెయ్యమని సలహా ఇచ్చేవారు.”

“మీకు దారి చూపించడానికి నేను ఈ శరీరంతో లేనప్పుడు కూడా, ఈ యోగకీలకానికున్న సామర్థ్యం పోదు. సిద్ధాంతపరమైన ఆవేశాల సముదాయంగా తలచి, కట్టుదిట్టంగా కవిలెకట్టలో దాచిపెట్టి, తరవాత మరిచిపోవడానికి వీలయినది కాదు ఈ యోగపద్ధతి. క్రియాయోగం ద్వారా నిరంతరాయంగా ముక్తిమార్గంలో ముందుకు సాగు; నువ్వు చేసే సాధనలోనే దీని శక్తి ఇమిడి ఉంది.”

“నా మట్టుకు నేను, పరమాత్మ సాక్షాత్కారం కోసం మానవుడు జరిపే అన్వేషణలో, స్వయంకృషితో ముక్తి సాధించడానికి రూపొందిం