పుట:Oka-Yogi-Atmakatha.pdf/862

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 49

1940-1951 మధ్యకాలం

“నిజానికి మేము, ధ్యానం విలువ గ్రహించడమే కాకుండా, మా అంతశ్శాంతిని ఏదీ భంగం చెయ్యజాలదని తెలుసుకున్నాం. గత కొద్ది వారాలుగా, మా ప్రార్థన సమావేశాలు జరుగుతున్న సమయాల్లో, మేము విమాన దాడి హెచ్చరికలు విన్నాం, ఆలస్యంగా పేలే బాంబుల చప్పుళ్ళు ఆలకించాం; అయినప్పటికీ మా విద్యార్థులు సమావేశమయి, చక్కని మా ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని పూర్తిగా ఆనందిస్తున్నారు.”

ఈ ధైర్య సందేశలేఖ రాసినవారు, లండన్ ఎస్. ఆర్. ఎఫ్. కేంద్రం నాయకుడు. రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించక ముందటి సంవత్సరాల్లో యుద్ధ బీభత్సం చెలరేగుతున్న ఇంగ్లండు నుంచి యూరప్‌దేశాలనుంచి నాకు వచ్చిన అనేక ఉత్తరాల్లో అది ఒకటి. లండన్ నుంచి వెలువడ్డ ప్రాచ్య జ్ఞానగ్రంథమాల (ది విజ్డం ఆఫ్ ది ఈస్ట్ సిరీస్) సంపాదకుడు డా॥ ఎల్. కాన్మర్ - బింగ్ , 1942లో నాకు ఇలా రాశాడు:

“నేను ‘ఈస్ట్-వెస్ట్’ పత్రిక చదివినప్పుడు, మనం, పైకి రెండు భిన్న లోకాల్లో కనిపించేవాటిలో ఉంటూ, ఎంత దూరస్థుల్లా గోచరిస్తూ ఉండేవాళ్ళమో గ్రహించాను. అందం, క్రమం, శాంతి, శుభం నాకు లాస్ ఏంజిలస్ నుంచి సమకూరుతున్నాయి. హోలీ గ్రెయిల్ (పవిత్ర పాన పాత్ర) ఆశీస్సులతోనూ ఉపశమనంతోనూ నిండిన ఓడ, రేవులోకి వచ్చినట్టుగా, ముట్టడిలో చిక్కుకున్న ఈ నగరానికి వచ్చాయి. తాటితోపు,