పుట:Oka-Yogi-Atmakatha.pdf/861

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలిఫోర్నియాలో ఎన్సినిటాస్‌లో

825

శిష్యులకు బహుముఖమైన శిక్షణ ఇస్తాయి. ఎన్సినిటాస్, లాస్ ఏంజిలస్ కేంద్రాల్లో ఉండేవాళ్ళ కోసం పండ్లూ కూరగాయలు పండించే తోటలు పెంచడం జరుగుతున్నది.

కోలనీ కార్యకలాపాల్లో, ఎన్. ఆర్. ఎఫ్. ఆశయాల్ని అనుసరించి శిష్యులకు బహుముఖమైన శిక్షణ ఇవ్వడం, ఎన్సినిటాస్ కేంద్రంలోనూ లాస్ ఏంజిలస్ కేంద్రంలోనూ ఉండే ఎస్. ఆర్. ఎఫ్. నివాసుల ఉపయోగార్థం తాజా కూరగాయలు పండించే విస్తృత వ్యవసాయపథకాన్ని అమలుపరచడం కూడా జరుగుతున్నది.

“ఈశ్వరుడు సమస్త దేశజనుల్నీ ఒకే రక్తంతో సృష్టించాడు.”[1] “ప్రపంచ సోదరత్వం” అన్నది పెద్ద మాటే; కాని మానవుడు తనను ప్రపంచ పౌరుడిలా పరిగణించుకొని తన సానుభూతులను విధిగా విస్తరింపజేసుకోవాలి. “ఇది నా అమెరికా, నా ఇండియా, నా ఫిలిపైన్స్, నా యూరప్, నా ఆఫ్రికా” వగైరాలు నిజంగా అర్థంచేసుకున్నవాడు సుఖమయ జీవనానికి అవకాశం పొందకుండా ఉండడు.

శ్రీయుక్తేశ్వర్‌గారి దేహం, భారతదేశంలో తప్ప మరెక్కడా నివసించనప్పటికీ, ఆయన ఈ సోదరభావ సత్యాన్ని ఎరుగుదురు:

“ప్రపంచం నా నివాసభూమి.”

  1. యాక్ట్స్ 17 : 26 (బైబిలు).