పుట:Oka-Yogi-Atmakatha.pdf/811

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

775

విలియం పెన్, 17 శతాబ్దిలో పెనిసిల్వేనియా వలస స్థాపించడంలో విజయవంతంగా పనిచేసిన అహింసా ప్రయోగాన్ని అమెరికన్లు గుర్తు చేసుకోవచ్చు. అప్పుడక్కడ, “కోటలు లేవు, సైనికులు లేరు, స్వచ్ఛంద సేనలు లేవు, ఆయుధాలు కూడా లేవు.” కొత్తగా వలసవచ్చిన వాళ్ళకూ స్థానిక ఎర్ర ఇండియన్లకూ మధ్య సాగిన దారుణమైన సరిహద్దు పోరాటాల్లోనూ మారణ కాండల్లోనూ ఏ కష్టాలకూ గురికాకుండా ఉన్నవాళ్ళు, పెనిసిల్వెనియా క్వేకర్లు అనే ఒక తెగవాళ్ళు మాత్రమే. “ఇతరుల్ని చంపేశారు; కొందర్ని ఊచకోత కోశారు; కాని వీళ్ళు క్షేమంగానే ఉన్నారు. క్వేకర్లలో ఒక్క ఆడది కూడా ఆపదకు గురికాలేదు; క్వేకర్లలో ఒక్క పిల్లవాణ్ణి కూడా చంపలేదు; ఒక్క మగవాణ్ణి కూడా హింసించలేదు.” చివరికి క్వేకర్లు, బలవంతాన రాష్ట్రపాలన విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు, “యుద్ధం రగిలింది; కొందరు పెనిసిల్వేనియా వాసుల్ని చంపేశారు; క్వేకర్లనయితే ముగ్గురినే చంపారు; ఆ ముగ్గురూ కూడా, ఆత్మరక్షణకోసం ఆయుధాలు తీసుకు వెళ్ళగూడదన్న విశ్వాసం కోల్పోయి పతనమైనవాళ్ళు.”

“మొదటి ప్రపంచ మహాయుద్ధంలో బలప్రయోగం ప్రశాంతి నెల