పుట:Oka-Yogi-Atmakatha.pdf/809

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

773

మధ్య చాలా కాలంగా సాగుతున్న వివాదాల్ని చాలావాటిని పరిష్కరించారు; కొన్ని లక్షలమంది ముస్లిములు గాంధీగారిని తమ నాయకుడుగా భావించుకున్నారు. అంటరానివాళ్ళు ఆయన్ని, తమకోసం నడుం కట్టిన నిర్భయ విజయ వీరుడిగా పరిగణిస్తారు. “నాకు మరో జన్మ కనక ఉండేటట్లయితే నేను అంటరానివాళ్ళలో ఒక అంటరానివాడిగా పుట్టాలని కోరుకుంటాను; ఎంచేతంటే, దానివల్లే నేను వాళ్ళకి మరింత సార్థకమైన సేవ చెయ్యగలుగుతాను,” అని రాశారు గాంధీగారు.

గాంధీ మహాత్ములు నిజంగా “మహాత్ములే”; కాని ఆయనకి ఆ బిరుదు ఇవ్వాలన్న వివేకం చూపించినవాళ్ళు, కోట్లకొద్ది నిరక్షరాస్యులు. సాధుసత్తముడైన ఈ ప్రవక్త తన దేశంలోనే గౌరవం పొందారు. నిమ్న స్థాయి రైతు, గాంధీగారి పెద్ద సవాలు అందుకోడానికి పెరగగలిగాడు. మనిషిలో స్వభావసిద్ధమయిన ఔదార్యాన్ని గాంధీమహాత్ములు హృదయ పూర్వకంగా విశ్వసిస్తారు. తప్పనిసరి అపజయాలు ఆయనకు ఎన్నడూ దిగ్భ్రమ కలిగించలేదు. “ప్రత్యర్థి తనను ఇరవై సార్లు దగా చేసినా, ఇరవై ఒకటోసారి కూడా అతన్ని నమ్మడానికి సిద్ధంగా ఉంటాడు సత్యాగ్రహి; ఎంచేతంటే, మానవ ప్రవృత్తి మీద అచంచల విశ్వాసం ఉండటమే అతని సిద్ధాంత సారం కనక,” అని రాశారు గాంధీగారు.[1]

  1. అప్పుడు పీటరు ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో ఎన్ని సార్లు పాపం చేస్తే నేను క్షమించాలి, ఏడు సార్లా? ఏసు ప్రభువు అతనికి చెప్పాడు, ఏడుసార్లేనని చెప్పను నీకు, ఏడుకు డెబ్బైరెట్లు సార్లంటాను.” - మత్తయి 18 : 21-22. అంగీకారయోగ్యం కాజాలని ఈ సలహాను అర్థంచేసుకోడానికి నేను గాఢంగా ధ్యానించాను. “ప్రభూ, అది సాధ్యమా?” అని ఆక్షేపణ తెలిపాను. అప్పుడు చివరికొక దివ్యవాణి జవాబిచ్చి, ఒక వెలుగు వెల్లువలో నన్ను ముంచెత్తింది. “ఓ మనిషీ, మీలో ప్రతివాణ్ణీ నేను రోజూ ఎన్ని సార్లు క్షమించడం లేదూ?”