పుట:Oka-Yogi-Atmakatha.pdf/808

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

772

ఒక యోగి ఆత్మకథ

ధాలు ఉండనే ఉన్నాయి,” అన్నాడు. ఆ స్థితిని నేను ఇలా తిప్పి చెప్పాలనుకుంటున్నాను: “ఇప్పటికే మన ఆయుధాలు విఫలమయాయి. ఇప్పుడిక కొత్తదారి వెతుక్కుందాం; సత్యమనే ప్రేమ, దైవశక్తిని ఉపయోగించి చూద్దాం. అది ఉంటే మన కింకేమీ అక్కర్లేదు.”

మహాత్ముల సందేశాన్ని వ్యాప్తిచేసే వేలాది నిజమైన సత్యాగ్రహుల్ని (ఈ అధ్యాయంలో తొలిభాగంలో ఉదాహరించిన పదకొండు కఠోర ప్రతిజ్ఞలూ తీసుకున్న వాళ్ళను) తర్ఫీదు చెయ్యడంవల్లా; అహింస వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలనూ ఉత్తరోత్తరా భౌతిక లాభాలనూ అవగాహన చేసుకునేందుకుగాను భారత జనసామాన్యానికి ఓర్పుతో బోధించడంవల్లా, అన్యాయానికి సహాయం చేయడానికి నిరాకరించడం, ఆయుధాలు చేపట్టడంకన్న అవమానాల్నీ జైలుశిక్షనూ చావునూ సైతం సహించడానికి అంగీకారం అన్న అహింసాత్మక ఆయుధాల్ని ప్రజలకు అందించడంవల్లా, సత్యాగ్రహుల్లో వీరోచితమైన బలిదానానికి లెక్కలేనన్ని ఉదాహరణల ద్వారా ప్రపంచ సానుభూతి సంపాదించడంవల్లా గాంధీగారు, అహింసకున్న ఆచరణానుకూల స్వభావాన్నీ, యుద్ధానికి దిగే అవసరం లేకుండా వివాదాల్ని పరిష్కరించుకోడానికి తోడ్పడే, దాని గంభీరశక్తినీ నాటకసహజంగా చిత్రీకరించారు.

మరే దేశంలోనూ మరే నాయకుడూ, తుపాకిగుండ్ల ద్వారా తప్ప మరే విధంగామా ఎన్నడూ తన దేశానికి సంపాదించని అనేక రాజకీయ పరిష్కారాల్ని అప్పటికే గాంధీగారు అహింసామార్గాల్లో సాధించారు. అన్ని తప్పుల్నీ అన్ని చెడుల్నీ నిర్మూలించడానికి అహింసా పద్ధతుల్ని రాజకీయ రంగంలోనే కాకుండా, భారతీయ సంఘ సంస్కరణ అనే సునిశిత సంకీర్ణ రంగంలో కూడా ప్రశస్తంగా ప్రయోగించడం జరిగింది. గాంధీగారూ ఆయన అనుచరులూ, హిందువులకూ, మహమ్మదీయులకూ