పుట:Oka-Yogi-Atmakatha.pdf/787

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

751

తన రోజువారీ కార్యకలాపాల గురించి నిర్దుష్టమైన హిందీలో నాకు చెబుతున్నప్పుడు పుష్టిగా, ప్రశాంతంగా ఉండే ఆమె ముఖంలో ఉత్సాహం వెల్లివిరిసింది.

“గ్రామ పునరుద్ధరణ కృషి లాభదాయకమైనది! మాలో ఐదుగురం ప్రతిరోజూ పొద్దున 5 గంటలకు లేచి, దగ్గరిలో ఉన్న పల్లెలో వాళ్ళకి సేవచేసి సాధారణ ఆరోగ్య నియమాలగురించి వాళ్ళకు బోధిస్తాం. వాళ్ళ పాకీదొడ్లూ బురదమట్టితో వేసిన తాటేకు గుడిసెలూ శుభ్రం చెయ్యడం ఒక పనిగా పెట్టుకున్నాం. పల్లెటూరివాళ్ళు చదువురానివాళ్ళు; చేసి చూపిస్తే తప్ప వాళ్ళకి నేర్పడం సాధ్యం కాదు!” అంటూ కులాసాగా నవ్విందామె.

ఉన్నత కుటుంబంలో జన్మించిన ఈ ఆంగ్ల వనిత చేత - మామూలుగా “అంటరానివాళ్ళు” మాత్రమే చేసే పాకిపని చేయించినది, నిజమైన క్రైస్తవ సహజమైన వినయం; అందుకు ఆమె వేపు ప్రశంసాపూర్వకంగా చూశాను.

“నేను 1925 లో భారతదేశం వచ్చాను,” అని చెప్పిందామె.