పుట:Oka-Yogi-Atmakatha.pdf/767

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

731

ఉంటుంది.[1] ఈ మూడు శరీరాల్నీ కలిపి ఉంచే సంయోజకశక్తి కోరిక తీరని కోరికల చాలనశక్తే మానవుడి బానిసతనానికి కారణం.

“భౌతిక వాంఛలకు మూలం అహంకారమూ ఇంద్రియ సుఖాలూ. ఇంద్రియానుభవ నిర్బంధం లేదా ప్రలోభం, సూక్ష్మలోక అనుబంధాలకు కాని కారణలోక అనుభూతులకు కాని సంబంధించిన వాంఛాశక్తికన్న ఎక్కువ శక్తిమంతమైనది.”

“సూక్ష్మలోక వాంఛలు, స్పందనరూప సుఖానుభవానికి సంబంధించినవి. సూక్ష్మలోక జీవులు వివిధ గోళాల ఆకాశ సంగీతాన్ని ఆలకించి సృష్టి అంతా పరివర్తనశీల కాంతి తాలూకు అనంతాభివ్యక్తులుగా కనబడ్డంవల్ల పరవశులై ఆనందిస్తారు. సూక్ష్మలోక జీవి వెలుగును వాసన చూస్తాడు, రుచి చూస్తాడు, తాకుతాడు. ఈ విధంగా సూక్ష్మలోక వాంఛలు అన్ని వస్తువుల్నీ అనుభవాల్నీ కాంతిరూపాలుగా, లేదా ఘనీభూత ఆలోచనలుగా, లేదా కలలుగా రూపొందించడానికి సూక్ష్మలోక జీవికి ఉండేశక్తిని బట్టి ఉంటాయి.”

“కారణలోక వాంఛలు అనుభూతివల్ల మాత్రమే నెరవేరతాయి. కారణ శరీరంలో మాత్రమే అబద్ధులై ఉండి, విముక్తప్రాయులైన జీవులు విశ్వాన్నంతనీ దేవుడి స్వప్నభావాలకు సిద్ధించిన ప్రత్యక్షరూపంగా దర్శిస్తారు; ఆలోచనమాత్రం చేతనే వాళ్ళు దేన్నయినా సాక్షాత్కరింప జెయ్యగలరు. కాబట్టి కారణ శరీరులు, భౌతిక ఇంద్రియ సుఖాన్నికాని, సూక్ష్మలోక ఆనందాన్ని కాని స్థూలమైనదిగానూ, ఆత్మకు కలిగే సూక్ష్మతర సంవేదనలకు అవరోధకంగానూ పరిగణిస్తారు. కారణ శరీరులు తమకు కావలసినవి తక్షణమే సాక్షాత్కరింపజేసుకొని కోరికలు నశింపజేసు

  1. శరీరమన్నది, స్థూలమయినా సూక్ష్మమయినా, ఆత్మను ఆవరించి ఉన్న ఏ కోశాన్నయినా సూచిస్తుంది.