పుట:Oka-Yogi-Atmakatha.pdf/766

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

730

ఒక యోగి ఆత్మకథ

కోశం, పదహారు స్థూల రసాయన మూలకాలతో రూపొందిన భౌతిక శరీరం నశించిన తరువాత కూడా ఉంటుంది.

“దేవుడు వివిధ తత్త్వాల్ని తనలోనే భావన చేసుకొని వాటిని స్వప్నాల్లోకి ప్రక్షేపించాడు. ఆ విధంగా, అనంత సాపేక్షతాభరణాలతో బృహత్పరిమాణంలో అలంకరించుకొన్న విశ్వస్వప్న మాయాసుందరి (Lady Cosmic Dream) ఆవిర్భవించింది.”

“కారణ శరీరంలోని ముప్ఫైఐదు తత్త్వాల్లోనూ భగవంతుడు, మనిషి సూక్ష్మశరీరం బాపతు పందొమ్మిది తత్త్వాల్నీ, భౌతిక శరీరం తాలూకు పదహారు తత్త్వాల్నీ సర్వసంకీర్ణతాయుతంగా సమకూర్చాడు. స్పందనశక్తుల్ని ఘనీభూతంచేసి, మొదట మనిషి సూక్ష్మ శరీరాన్ని చివరికి భౌతిక శరీరాన్ని సృష్టించాడాయన. మౌలిక సారళ్య రూపుడయిన పరమేశ్వరుడు దిగ్భ్రమకారకమైన నానాత్వంగా పరిణమించడానికి కారణమయిన సాపేక్షతానియమం ప్రకారం కారణవిశ్వమూ కారణ శరీరమూ సూక్ష్మవిశ్వానికి సూక్ష్మదేహానికి భిన్నంగా ఉంటాయి. అలాగే భౌతికవిశ్వమూ భౌతికదేహమూ కూడా స్వభావతః, సృష్టిలోని ఇతర రూపాలకు భిన్నంగా ఉంటాయి.”

“రక్తమాంసాలతో కూడిన శరీరం, సృష్టికర్త నిశ్చిత, ప్రత్యక్షీకృత స్వప్నాలతో ఏర్పడినది. ఆరోగ్య అనారోగ్యాలూ కష్టసుఖాలూ లాభనష్టాలూ అన్న ద్వంద్వాలు భూమిమీద ఎప్పుడూ ఉంటాయి. మానవులకు త్రిమితీయ (three-dimensional) పదార్థంలో పరిమితీ ప్రతిరోధమూ తప్పవు. మనిషికి బతికుండాలన్న కోరిక, జబ్బువల్లనో మరే కారణాలవల్లనో తీవ్రంగా సడలిపోయినట్లయితే మరణం సంభవిస్తుంది; మాంసరూపమైన బరువైన బాహ్యకళేబరాన్ని తాత్కాలికంగా వదిలెయ్య వలసి వస్తుంది. అయితే ఆత్మ, సూక్ష్మ కారణ శరీరాల్లో అబద్ధమై