పుట:Oka-Yogi-Atmakatha.pdf/765

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

729

లోకాల్లోనూ నిరాశాజనకమైన భౌతిక లోకాల్లోనూ కలిగిన అనేక అనుభవాల తాలూకు అవచేతనకన్న గాఢమైన జ్ఞాపకాల్ని మనిషిలో రేకెత్తిస్తాయి.”

“గురుదేవా, భూమిమీదా సూక్ష్మ కారణ లోకాల్లోనూ సంభవించే పునర్జన్మల భేదాన్ని వివరంగా చెప్పరూ?” అని అడిగాను.

“మానవుడు ప్రధానంగా వైయక్తికీకృత ఆత్మగా, కారణ శరీరుడు,” అంటూ వివరించారు మా గురుదేవులు. “ఆ శరీరం ముప్ఫైఐదు తత్త్వాలతో (భావాలతో) కూడినది; దాన్ని రూపొందించడానికి మౌలిక ఆలోచనాశక్తులుగా, లేదా, కారణ ఆలోచనాశక్తులుగా, దేవుడికి అవి అవసరమయాయి; ఆ తరవాత ఆయన, వాటిలోంచి పందొమ్మిది తత్త్వాలు తీసుకొని సూక్ష్మశరీరాన్నీ, పదహారు తత్త్వాలు తీసుకొని భౌతికశరీరాన్ని నిర్మించాడు.

“సూక్ష్మశరీరంలో ఉండే పందొమ్మిది తత్త్వాలూ మానసికమైనవీ, భావోద్రేకపరమైనవీ, ప్రాణకణికాపరమైనవీ. ఆ పందొమ్మిది అంశాలూ ఏవంటే: బుద్ధి (తెలివి); అహంకారం; చిత్తం (అనుభూతి), మనస్సు (ఇంద్రియ స్పృహ); ఐదు జ్ఞానేంద్రియాలు- చూపు, వినుకలి, వాసన, రుచి, స్పర్శ (శబ్దస్పర్శరూపరసగంధాలు) గ్రహించడానికి ఉపకరించే సూక్ష్మ ప్రతిరూపాలు; ఐదు కర్మేంద్రియాలు - ప్రజననానికీ విసర్జనకూ మాటకూ నడకకూ కాయిక కర్మలకూ ఉపకరించే సామర్థ్యాల మానసిక ప్రతిరూపాలు; ప్రాణశక్తి తాలూకు ఇంద్రియాలు ఐదు - శరీరంలో స్ఫటికీకరణ (crystallizing), స్వాంగీకరణ (assimilating), విసర్జన (eliminating), జీవాణుపాక (metabolizing), ప్రసరణ (circulating) కార్యాలు జరిపేవి (ప్రాణాపాన వ్యానోదానసమావ వాయువులు ). పందొమ్మిది తత్త్వాల సూక్ష్మ శరీర