పుట:Oka-Yogi-Atmakatha.pdf/755

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

719

నాల్ని, లేదా స్పందనశీల ప్రాంతాల్ని సమకూర్చడం జరిగింది. మంచివి స్వేచ్ఛగా ప్రయాణం చేస్తాయి; కాని దుష్టశక్తులు పరిమిత మండలాలకు లోబడి ఉంటాయి. మనుషులు భూమిమీదా, పురుగులు మట్టిలోనూ, చేపలు నీళ్ళలోనూ, పక్షులు గాలిలోనూ ఉండేటట్టే, వివిధ శ్రేణుల సూక్ష్మలోక జీవులకు సముచితమైన స్పందనశీల నివాసాలు సమకూరి ఉంటాయి.”

“వివిధ సూక్ష్మలోకాలనుంచి వెలివేసిన, పతిత దేవదూతలమధ్య ప్రాణకణికాస్త్రాలు (లైఫ్‌ట్రానిక్ బాంబులు), లేదా మానసిక మంత్రశక్తుల[1] స్పందనశీల కిరణాలతో ఘర్షణ, యుద్ధం జరుగుతూంటాయి. ఈ బహిష్కృతులు తమ దుష్కర్మను అనుభవిస్తూ నిమ్నతర సూక్ష్మ విశ్వంలోని అంధకారాచ్ఛన్న ప్రాంతాల్లో నివసిస్తూంటారు.”

“అంధకారమయమైన సూక్ష్మ కారాగారానికి పైనుండే విశాల మండలాలన్నీ ప్రకాశమానంగా అందంగా ఉంటాయి. సూక్ష్మ విశ్వం భూమికన్న ఎక్కువ సహజంగా, దైవసంకల్పంతోనూ పరిపూర్ణతా పరికల్పనతోనూ అనుసంధానం చెంది ఉంటుంది. సూక్ష్మలోక వస్తువు ప్రతిదీ ప్రధానంగా దైవసంకల్పంవల్లా పాక్షికంగా సూక్ష్మలోక జీవుల ఆహ్వాన సంకల్పంవల్లా ఆవిర్భవిస్తుంది. దేవుడు సృష్టించినదాన్ని దేన్నయినా మార్చేయడానికి కాని, దాని అందాన్ని రూపాన్ని అతిశయింప జేయడానికి కాని వాళ్ళకి శక్తి ఉంటుంది. సూక్ష్మవిశ్వాన్ని తమ ఇచ్ఛానుసారంగా మార్చేసే స్వాతంత్ర్యమూ, లేదా మెరుగుపరిచే స్వాతంత్ర్యమూ

  1. ‘మంత్ర’ శబ్దానికి ఏకాగ్రత అనే మానసికమైన ఫిరంగిలోంచి విడుదల అయిన బీజాక్షరమని అర్థం. ‘మాంత్రిక’ శబ్దం, దీనికి విశేషణరూపం. దేవాసురులకు మధ్య జరిగిన మాంత్రిక యుద్ధాల్ని పురాణాల్లో వివరించారు. ఒక అసురడు [వృత్రాసురుడు] ఒకసారి, శక్తిమంతమైన ఒక మంత్రంతో ఒక దేవతను [ఇంద్రుణ్ణి] చంపదలుచుకున్నాడు. కాని, ఉచ్చారణలో అపస్వరం రావడంవల్ల అతని మానసికాస్త్రం బెడిసికొట్టి, ఆ రాక్షసుణ్ణి చంపేసింది.