పుట:Oka-Yogi-Atmakatha.pdf/756

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

720

ఒక యోగి ఆత్మకథ

హక్కూ, భగవంతుడు తన సూక్ష్మలోక సంతానానికి ఇచ్చాడు. భూమిమీద ఒక ఘనపదార్థాన్ని ద్రవరూపంలోకి కాని, ఇతర రూపంలోకి కాని మార్చాలంటే సహజ ప్రక్రియద్వారా, లేదా రసాయన ప్రక్రియలద్వారా మార్చాలి. కాని సూక్ష్మలోకపు ఘనపదార్థాల్ని కేవలం, అక్కడ నివసించేవాళ్ళ సంకల్పమాత్రంచేత, తక్షణమే సూక్ష్మద్రవాలుగానూ, వాయువులుగానూ లేదా అణుశక్తిగానూ మార్చడం జరుగుతున్నది.”

“సముద్రంలోనూ నేలమీదా గాలిలోనూ జరిగే యుద్ధాలతో, హత్యలతో ఈ భూమి కళంకితమైపోయింది,” అంటూ ఇంకా చెప్పసాగారు గురుదేవులు. “కాని, సూక్ష్మలోక రాజ్యాలకు సుఖప్రదమైన సామరస్యమూ సమానత్వమూ తెలుసు. సూక్ష్మలోక జీవులు తమ రూపాల్ని సంకల్పానుసారంగా సాక్షాత్కరింపజేయడం, అదృశ్యంచేయడం చేస్తూంటారు. పువ్వులుకాని, చేపలుకాని, జంతువులుకాని తాత్కాలికంగా, సూక్ష్మలోక మానవులుగా రూపాంతరణం చెందగలవు. సూక్ష్మలోక జీవులన్నీ స్వేచ్ఛగా ఏ రూపమయినా తాల్చి, ఒకదాంతో ఒకటి సులువుగా భావసంపర్కం పెట్టుకోగలవు. స్థిరంగా, కచ్చితంగా ఉండే ప్రకృతి నియమం ఏదీ వాటిని నిర్బంధించదు. మాటవరసకు, ఏ సూక్ష్మలోక వృక్షాన్నయినా సూక్ష్మలోకపు మామిడిపండుకాని, పువ్వుకాని - నిజం చెప్పాలంటే, మరే వస్తువునయినా కాని- సృష్టించి ఇమ్మని అడిగి తీసుకోవచ్చు. కొన్నికొన్ని కర్మసంబంధమైన ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ, వివిధ రూపాల్ని కోరడం విషయంలో, సూక్ష్మలోకంలో విభేదాలు లేవు. ప్రతిదీ దేవుడి సృజనాత్మక కాంతితో స్పందిస్తూ ఉంటుంది.”

“అక్కడివాళ్ళెవరూ తల్లికడుపున పుట్టినవాళ్ళు కారు. సూక్ష్మలోక వ్యక్తులు, విశ్వానుసంధానంచెంది ఉన్న తమ సంకల్పం ఇచ్చే ఆదేశాలతో విశిష్టకల్పనాయుక్తమైన సూక్ష్మరూపాలుగల సంతానాన్ని